ఖలిస్థానీ వివాదంపై భారత్‌ చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదు: జస్టిన్‌ ట్రూడో

కెనడాలో( Canada ) ఖలిస్థానీ మద్దతుదారులు భారత్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తోన్న విషయం అందరికీ తెలిసిందే.1984లో భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య జరిగిన తీరును అక్కడ ఇటీవల ఉత్సవంగా నిర్వహించడంతో ఇటువంటి దుశ్చర్యలను అడ్డుకోవాలని కెనడాకు భారత్‌ పలుమార్లు సూచించినది.అంతేకాకుండా ఆ దేశ రాయబారికి కూడా సమన్లు జారీ చేయడం జరిగింది.అయినప్పటికీ జస్టిన్‌ ట్రూడో( Justin Trudeau ) నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరించడం విశేషం.

 Canada Soft On Khalistanis Pm Justin Trudeau Responds To Indias Criticism Detail-TeluguStop.com

ఇదే విషయాన్ని భారత్‌ పలు సందర్భాల్లో పేర్కొనగా.అందులో వాస్తవం లేదంటూ కెనడా ప్రధాని వ్యాఖ్యానించడం కొసమెరుపు.

Telugu America, Canada, Canadapm, Indias, Justin Trudeau, Latest, Nri, Pro Khali

ఓట్ల కోసమే అతివాద సిక్కు ఖలిస్థాన్‌ వాదంపై( Khalistan ) మీరు ఈ రకంగా మెతక వైఖరిని ప్రదర్శిస్తున్నారా? అని ట్రూడోను అక్కడ మీడియా ప్రశ్నించగా.ఆయన స్పందిస్తూ, “భారత్‌ చేస్తోన్న ఆరోపణలు పూర్తిగా తప్పు.హింస, బెదిరింపులను కెనడా దేశం పూర్తిగా తీవ్రంగా పరిగణిస్తుంది.ఉగ్రవాదంపై మేం ప్రతిసారి కఠిన చర్యలు తీసుకున్నాం.ఇక్కడ భావప్రకటనా స్వేచ్ఛ ఉంది.కానీ.

హింస, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా చర్యలు తీసుకుంటున్నాం!” అని పేర్కొన్నారు.జులై 8న కెనడాలో ‘ఖలిస్థాన్‌ ఫ్రీడం ర్యాలీ’( Khalistan Freedom Rally ) నిర్వహిస్తామంటూ పోస్టర్లు చక్కర్లు కొడుతున్న వేళ ట్రూడో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Telugu America, Canada, Canadapm, Indias, Justin Trudeau, Latest, Nri, Pro Khali

ఇకపోతే ఖలిస్థాన్‌ మద్దతుదారులు ఇటీవల అమెరికా శాన్‌ ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్య కార్యాలయంపై( Indian Consulate ) దాడికి పాల్పడి, నిప్పు పెట్టిన విషయం విదితమే.ఈ ఘటనను అగ్రరాజ్యం కూడా తీవ్రంగా ఖండించింది.దాంతో ఈ తరహా దాడుల విషయంలో బ్రిటన్‌ ఓ హెచ్చరిక ప్రకటన విడుదల చేసింది.లండన్‌లోని భారత హైకమిషన్‌పై దాడులు ఏ విధంగా కూడా ఆమోదయోగ్యం కాదని బ్రిటన్‌ విదేశాంగ మంత్రి జేమ్స్‌ క్లెవర్లీ( James Cleverly ) ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

హైకమిషన్‌లోని సిబ్బంది భద్రత తమకు అత్యంత ప్రధానమని భారత హైకమిషనర్‌ విక్రమ్‌ దొరైస్వామితోపాటు ప్రభుత్వానికి తెలిపినట్లు ఓ ట్వీట్ చేయడం జరిగింది.జులై 8న స్థానికంగా ఖలిస్థానీ ర్యాలీ నిర్వహణపై పోస్టర్లు వెలిసిన వేళ ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube