ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న హీరోయిన్ ఎవరంటే అందరు చెప్పే పేరు ఒక్కటే ఆమె మలయాళ భామ సంయుక్త మీనన్.( Samyuktha Menon ) ఈ అమ్మడు చేసిన ప్రతి సినిమా హిట్ అవడంతో ఆమెకు టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ అనే ట్యాగ్ వచ్చేసింది.
భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సంయుక్త ఆ తర్వాత కళ్యాణ్ రామ్ బింబిసార లో( Bimbisara ) నటించింది.రెండు సినిమాలు హిట్ అవడంతో ఆమెకు ధనుష్ సార్ సినిమా( Sir Movie ) ఆఫర్ వచ్చింది.
అది కూడా కమర్షియల్ గా వర్క్ అవుట్ అయ్యింది.ఇక సాయి తేజ్ విరూపాక్ష సినిమాలో( Virupaksha ) కూడా అమ్మడు నటించగా అది సూపర్ హిట్ అయ్యింది.
కథల సెలక్షన్ లో జాగ్రత్త పడుతున్న సంయుక్త. సినిమా ఫలితాలను కూడా అదే రేంజ్ లో అందుకుంటుంది.ఇక లేటెస్ట్ గా కళ్యాణ్ రామ్ డెవిల్( Devil Movie ) సినిమాలో నటిస్తుంది సంయుక్త.ఈ సినిమా టీజర్ బుధవారం కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు.
చూస్తుంటే కళ్యాణ్ రామ్ ఖాతాలో మరో హిట్ పక్కా అనిపించేలా టీజర్ ఉంది.సినిమాలో సంయుక్త ఉంది కాబట్టి ఆమె లక్ కూడా కలిసి వచ్చేలా ఉంది.
సో సంయుక్త ఈ సినిమా హిట్ కొడితే వరుసగా ఐదు సినిమాలు హిట్ అందుకున్నట్టే లెక్క.