తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) అల్లూరి సీతారామరాజు( Alluri Sitaramaraju ) 125వ జయంతి వేడుకలలో సంచలన వ్యాఖ్యలు చేశారు.విజయవాడలో( Vijayawada ) నిర్వహించిన ఈ వేడుకలలో చంద్రబాబు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జయంతిని రాష్ట్రపతి గుర్తించిన వైసీపీ ప్రభుత్వం గుర్తించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు.2014లో తెలుగుదేశం ప్రభుత్వం అల్లూరి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు ఇచ్చిందని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు.ప్రజాహితం కోసమే రాజకీయాలు తప్ప స్వార్థం కోసం చేసేవి రాజకీయాలు కావలి ధ్వజమెత్తరు.

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతిలో అల్లూరి సీతారామరాజు మెమోరియల్ ఏర్పాటు చేయడంతో పాటు భోగాపురం విమానాశ్రయానికి ఆయన పేరు పెడతామని అన్నారు.అదేవిదంగా ఢిల్లీ పార్లమెంటులో అల్లూరి విగ్రహాన్ని ప్రతిష్టించాలి.అప్పుడు ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు.ప్రపంచానికి సేవ చేసే శక్తి భారతదేశనికి వస్తుందని.చరిత్రలో శాశ్వతంగా నిలిచే పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు.అల్లూరి స్ఫూర్తితో ప్రాణ త్యాగం చేసేందుకు తెలుగుజాతి సిద్ధంగా ఉంది అంటూ ఈ వేడుకలలో చంద్రబాబు వ్యాఖ్యానించారు.







