ఏపీ సీఎం జగన్ కు మాజీ ఎంపీ హరిరామజోగయ్య మరో లేఖ రాశారు.వైఎస్ఆర్ హుందాతనంలో పది శాతం కూడా జగన్ లో లేదని ఆరోపించారు.
జగన్ సినిమాల్లో విలన్ పాత్రకు సరిపోతారేమో అనిపిస్తోందని పేర్కొన్నారు.పవన్ పెళ్లిళ్లపై జగన్ చౌకబారు విమర్శలు మానుకోవాలని హరిరామజోగయ్య లేఖలో సూచించారు.
పవన్ ను విమర్శించడానికి మరో విషయం లేకనే జగన్ ఇలా అనవసర విమర్శలు చేస్తున్నారా అని ప్రశ్నించారు.జగన్ అవినీతి చిట్టాను ప్రజల ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.







