దేశంలోని ప్రతిపక్షాలు నిర్వహిస్తున్న రెండో సమావేశం షెడ్యూల్ ప్రకారమే జరగనుంది.ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు.
షెడ్యూల్ ప్రకారం ఈనెల 17, 18 వ తేదీల్లో బెంగళూరులో విపక్షాల రెండో సమావేశం జరగనుందని పేర్కొన్నారు.అయితే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఉన్న నేపథ్యంలో ప్రతిపక్షాల సమావేశం వాయిదా పడినట్లు ప్రచారం జరిగింది.
దీంతో కేసీ వేణుగోపాల్ ఆ ప్రచారానికి చెక్ పెడుతూ ట్వీట్ తో సమాధానం ఇచ్చారు.కాగా గత నెల 23న పాట్నాలో ప్రతిపక్షాల మొదటి సమావేశం జరిగిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా విపక్షాలు కలిసికట్టుగా పని చేయడంపై చర్చించారు.ఈ క్రమంలోనే బీజేపీని ఓడించడానికి విపక్షాలు ఐక్యంగా పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నాయి.