కంప్యూటర్( Computer ) పనిచేయాలంటే తప్పనిసరిగా ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి.ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా ఏ కంప్యూటర్, ల్యాప్ టాప్ పనిచేయదనే విషయం మనందరికీ తెలిసిందే.
ఆపరేటింగ్ సిస్టమ్( Operating system ) లో అందరికీ తెలిసింది విండోస్.మైక్రోసాఫ్ట్ సంస్థకు చెందిన విండోస్ ఆఫరేటింగ్ సిస్టమ్( Windows operating system ) లు తప్పనిసరిగా వాడుతూ ఉంటారు.
లైనెన్స్, యూనిక్స్ లాంటి చాలా ఆపరేటింగ్ సిస్టమ్ లు ఉన్నా సరే.ఎక్కువమంది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ నే వాడుతూ ఉంటారు.అయితే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి.
తాజాగా విండోస్ 11లో( Windows 11 ) మరోక కొత్త అప్‌డేట్ వచ్చింది.కొత్తగా పాస్ కీ అనే కొత్త ఫీచర్ ను విండోస్ 11లో తీసుకొచ్చారు.దీని ద్వారా యూజర్లు ఏదైనా వెబ్ సైట్ లేదా యాప్ లలో లాగిన్ అవ్వాలంటే పాస్ వర్డ్ అవసరం లేకుండా పాస్ కీని ఉపయోగించుకోవచ్చు.
దీని వల్ల యూజర్లు ప్రతిసారి వెబ్ సైట్లకు లాగిన్ అవ్వడానికి పాస్ వర్డ్ లు క్రియేట్ చేసుకోకుండా పాస్ కీ ద్వారా సులువుగా లాగిన్ అవ్వొచ్చు.ఈ పాస్ కీలను హ్యాకింగ్ చేయడం కూడా చాలా కష్టం.
విండోస్ 11 ఇన్ సైడర్ ప్రివ్యూ బిల్డ్ 23456 యూజర్లకు ఈ అప్డేట్‌ను విడుదల చేస్తున్నారు.మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌ని వాడుతున్న యూజర్లు పాస్ కీ ఆప్షన్ ఉన్న సైట్లలో విండోస్ హాలో ద్వారా ఫేస్, ఫింగర్‌ప్రింట్ లేదా పిన్ ను ఉపయోగించి కొత్తగా సృష్టించిన పాస్ కీ అకౌంట్‌కు సైన్ ఇన్ కావొచ్చు.ఫేస్ రికగ్నినైజేషన్, ఫింగర్‌ప్రిట్‌లను దొంగలించడం కాబట్టి దీని వల్ల సెక్యూర్ ఉంటుందని అంటున్నారు.ఈ కొత్త ఫీచర్ విండోస్ 11 వినియోగదారులకు ఎంతో ఉపయోగపడుతుంది.