20 లక్షల పెట్టుబడితో కోట్ల రూపాయిల లాభం..'తొలిప్రేమ' రీ రిలీజ్ బయ్యర్స్ కి పండగే!

కొత్త సినిమాలతోనే కాదు, ప్రసాద్ లాబ్స్ లో మూలనపడి ఉన్న పాత సూపర్ హిట్ సినిమాల రీల్స్ తో కూడా కోట్ల రూపాయిలు సంపాదించొచ్చు అని రీసెంట్ గా రీ రిలీజ్ సినిమాలు నిరూపిస్తున్నాయి.పాత సినిమా నుండి నెగటివ్ ని తీసుకొని, దానిని లేటెస్ట్ 4K టెక్నాలజీ కి మార్చి, డాళ్బీ అట్మాస్ సౌండ్ ని మిక్స్ చేసి అభిమానులకు మరియు ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ అనుభూతిని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్.

 Tholi Prema Re-release Box Office Collection , Hyderabad , Tholi Prema, Pawan-TeluguStop.com

ఈ ప్రయత్నం లో పలు సినిమాలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి, పలు సినిమాలు కనీస స్థాయిలో కూడా వసూళ్లు రాబట్టలేక నష్టాలను మిగిలించాయి.పాత సినిమాని 4K కి మార్చాలి అంటే కచ్చితంగా 20 లక్షల రూపాయిల వరకు ఖర్చు అవుతుంది.

రీసెంట్ గా విడుదలైన తొలిప్రేమ( Tholi Prema ) సినిమాకి కూడా అంతే ఖర్చు అయ్యింది.పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ గా నిల్చిన ఈ సినిమాని రీసెంట్ గానే గ్రాండ్ గా విడుదల చేసారు.

Telugu Tholi Prema, Eenagaraniki, Hyderabad, Pawan Klayan, Tollywood-Movie

రీసెంట్ గానే ఎలాంటి గుట్టుచప్పుడు కాకుండా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం సునామి లాంటి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకు పోతుంది.ట్రేడ్ పండితుల లెక్క ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజే కోటి 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్ళు వచ్చాయట, ఎలాంటి ప్రొమోషన్స్( Promotions ) లేకుండా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం అనేది సాధారణమైన విషయం కాదు.ఇదే ఊపుని రెండవ రోజు కూడా కొనసాగించింది.రెండవ రోజు ఈ చిత్రానికి 30 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట.అందులో కేవలం హైదరాబాద్( Hyderabad )సిటీ నుండే 20 లక్షల రూపాయిలు వచ్చినట్టు సమాచారం.ఈ రోజు కూడా ఈ చిత్రానికి అన్నీ ప్రాంతాలలో డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అయ్యాయి.

అలా 20 లక్షల రూపాయిల ఖర్చు తో ఈ సినిమా మూడు రోజుల్లో రెండు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది అంటున్నారు.

Telugu Tholi Prema, Eenagaraniki, Hyderabad, Pawan Klayan, Tollywood-Movie

ఇప్పుడు ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సినిమా లేకపోవడం తో మరో వారం రోజులు ఈ చిత్రానికి వసూళ్లు వస్తూనే ఉంటాయని అంటున్నారు.అలా మొత్తం మీద ఈ చిత్రం ఫుల్ రన్ లో 3 కోట్ల రూపాయిల గ్రాస్ మరియు కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.దీనితో నిర్మాతకు 80 లక్షల రూపాయిలు మిగిలుతుందట.

మరో పక్క ‘ఈ నగరానికి ఏమైంది( Ee Nagaraniki Emaindi )’ అనే చిత్రం కూడా ఇదే స్థాయి వసూళ్లను రాబడుతుంది.సరైన సినిమా లేక, బిజినెస్ లు జరగక ట్రేడ్ మొత్తం డల్ అయిపోయిన ఈ సందర్భం లో, ఈ రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తూ బయ్యర్స్ కి లాభాల వర్షం కురిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube