త్వరలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) పుట్టిన రోజు రాబోతుంది అనే విషయం తెలిసిందే.మరి ఆయన ఫ్యాన్స్ ఈయన నుండి ఏదొక ట్రీట్ కోరుకుంటూనే ఉంటారు.
అందుకే దర్శక నిర్మాతలు కూడా మహేష్ ఫ్యాన్స్ కోసం ఆయన పుట్టిన రోజు నాడు సర్ప్రైజ్ రెడీ చేస్తున్నారు.ఇప్పుడు మన టాలీవుడ్ లో నడుస్తున్న ట్రెండ్ ఏంటో తెలిసిందే.
టాలీవుడ్( Tollywood ) లో ప్రజెంట్ రీరిలీజ్ ట్రెండ్ నడుస్తుంది.స్టార్ హీరోల కెరీర్ లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను మళ్ళీ ఫ్యాన్స్ కోసం నిర్మాతలు రీ రిలీజ్ చేయడం ఇప్పుడు కామన్ అయిపొయింది.
ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోల సినిమాలు తమ పుట్టిన రోజు నాడు రిలీజ్ అవ్వగా అన్ని కూడా మంచి కలెక్షన్స్ ను రాబట్టి మరోసారి నిర్మాతల జేబులను నింపాయి.
ఇక వచ్చే నెల ఆగస్టులో మహేష్ బర్త్ డే ఉన్న నేపథ్యంలో ఈయన నటించిన బ్లాక్ బస్టర్ సినిమాను కూడా రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు.మహేష్ కెరీర్ లో మాస్ హిట్ అంటే ”బిజినెస్ మెన్” ( Business Men )అనే చెప్పాలి.ఈ సినిమా రీ రిలీజ్ నెక్స్ట్ లెవల్లో చేయబోతున్నారు అని తెలుస్తుంది.
ఈ సినిమా 4కే వర్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయట.
దీంతో ఈసారి మహేష్ బర్త్ డే రోజు బిగ్గెస్ట్ బ్లాస్ట్ ఖాయం అంటున్నారు.మరి ఈ విషయంలో మాస్ హంగామా ఎలా ఉంటుందో చూడాలి.ఈ సినిమాను పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేయగా కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) హీరోయిన్ గా నటించింది.
థమన్ సంగీతం అందించిన ఈ సినిమా రీ రిలీజ్ కలెక్షన్స్ ఏ రేంజ్ లో వస్తాయో వేచి చూడాలి.ఇక ప్రజెంట్ మహేష్ బాబు చేస్తున్న గుంటూరు కారం మూవీ నుండి కూడా ఆయన బర్త్ డే కానుకగా అదిరిపోయే ట్రీట్ రెడీ అవుతుంది.
దీంతో ఈసారి ఫ్యాన్స్ కు డబల్ ట్రీట్ రెడీ.