3 కోట్లు పెట్టి కొన్నారు.. 2 రోజుల్లో ఎంత వసూళ్లు వచ్చాయో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

ఇండస్ట్రీ లో మంచి క్రేజీ గా ఎదిగేందుకు అన్నీ లక్షణాలు ఉన్నప్పటికీ కూడా, కాలం కలిసి రాక ఇప్పటికీ తనకంటూ సరైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకోలేకపోయిన హీరోలు మన ఇండస్ట్రీ లో చాలామంది ఉన్నారు.అలాంటి హీరోలలో ఒకడు ‘శ్రీ విష్ణు'( Sri Vishnu ).

 Sri Vishnu Samajavaragamana Two Days Box Office Collections,samajavaragamana,sri-TeluguStop.com

కెరీర్ ప్రారంభం తోనే ఇతను హీరో అయిపోలేదు.క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలలో నటించాడు.

కొన్ని సినిమాలలో కమెడియన్ గా కూడా చేసాడు.అలా చిన్నగా హీరో గా మారి విభిన్నమైన కథలను ఎంచుకుకుంటూ ముందుకు దూసుకెళ్లాడు.

కానీ అన్నీ ప్రయత్నాలే కానీ సక్సెస్ రేట్ చాలా తక్కువ.పాపం ఈ కుర్రాడికి అదృష్టమే కలిసి రావడం లేదు, మార్కెట్ పెరగడం లేదు.

అయితే గత ఏడాది ఈయన హీరో గా నటించిన ‘రాజ రాజ చోర'( Raja Raja Chora ) అనే సినిమా పెద్ద హిట్ అయ్యింది.ఇక ట్రాక్ లోకి వచ్చాడు, శ్రీవిష్ణు టాలెంట్ కి తగ్గ ఫలితం ఇన్ని రోజులకు వచ్చింది అని అందరూ అనుకున్నారు.

Telugu Naresh, Ram Abbaraju, Sri Vishnu-Movie

కానీ ఆ సినిమా తర్వాత ఆయన చేసిన చిత్రాలన్నీ బోల్తా కొట్టాయి.దీనితో అతని మార్కెట్ డౌన్ అయ్యింది.ఇక అప్పటికి మనోడికి జ్ఞానోదయం అయ్యి ఈసారి చేస్తే కమర్షియల్ ఎంటర్టైనర్ చెయ్యాలని ‘సామజవరగమనా'( Samajavaragamana ) అనే చిత్రం తో మన ముందుకు వచ్చాడు.ఈ చిత్రం విడుదలకు రెండు రోజుల ముందే స్పెషల్ ప్రీమియర్ షో ద్వారా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.

ఇక విడుదల తర్వాత కూడా పర్ఫెక్ట్ కామెడీ ఎంటర్టైనర్ గా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.కానీ వసూళ్లే ఆ టాక్ కి తగ్గ రేంజ్ లో రాలేదు.

మొదటి రోజు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు, ఇక రెండవ రోజు కూడా అంతే, కానీ మూడవ రోజు మాత్రం మార్నింగ్ షోస్ తోనే మంచి ఆక్యుపెన్సీ తో ప్రారంభం అయ్యింది ఈ చిత్రం.అలా మొదటి రెండు రోజులకు కలిపి రెండు కోట్ల రూపాయిల షేర్'( Samajavaragamana Collections ) వసూళ్లను సాధించిన ఈ చిత్రం, మూడవ రోజు మాత్రం కోటి రూపాయలకు పైగా షేర్ ని రాబట్టే ఛాన్స్ ఉందట.

Telugu Naresh, Ram Abbaraju, Sri Vishnu-Movie

ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్'( Samajavaragamana Theatrical Business ) దాదాపుగా 3 కోట్ల 20 లక్షల రూపాయిల రేంజ్ లో జరిగింది.నేటితో బ్రేక్ ఈవెన్ మార్కుని దాటే అవకాశం కూడా ఉందట.కానీ శ్రీ విష్ణు మార్కెట్ ని పెంచే రేంజ్ లో ఫుల్ రన్ వసూళ్లు రావని అంటున్నారు ట్రేడ్ పండితులు.మొత్తానికి అయితే ఆయన ఫ్లాప్స్ నుండి బయటపడ్డాడు.

ఇక నుండి ఇదే సక్సెస్ స్ట్రీక్ ని కొనసాగిస్తే శ్రీ విష్ణు మార్కెట్ మీడియం రేంజ్ హీరో స్థాయి కి చేరుకుంటుంది.ఒక హిట్టు కొట్టగానే అరడజను ఫ్లాప్ సినిమాలు తీసే అలవాటు ఉన్న శ్రీవిష్ణు, ఇక నుండి అయినా కమర్షియల్ సినిమాలు చేస్తాడో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube