నిమ్మరసం, తేనె, కొబ్బరి నూనెతో వయస్సు తగ్గించుకోవచ్చని చెబుతున్న హార్వర్డ్ శాస్త్రవేత్త!

వైద్యరంగంలో ఎప్పుడూ ఏదో ఒక అద్భుతం చేస్తున్న శాస్త్రవేత్తలు ఎంతో కాలంగా వయస్సును తగ్గించడంపై అనేక పరిశోధనలు సాగిస్తున్నారు.అలాంటి ఓ అద్భుతాన్ని చేసి చూపించాడు హార్వర్డ్ శాస్త్రవేత్త డేవిడ్ సింక్లైర్.

 Here Are Some Tips To Stay Young By Harvard Scientist David Sinclair Details, H-TeluguStop.com

( Harvard Scientist David Sinclair ) అవును… జీవశాస్త్రవేత్త, యాంటీ ఏజింగ్ పరిశోధకుడు అయిన డేవిడ్ సింక్లైర్ ఎంతో కాలంగా వయస్సును తగ్గించడంపై( Anti Aging ) రకరకాల పరిశోధనలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఆయన తన వయస్సును పదేళ్లు తగ్గించుకున్నట్లు ప్రకటించారు.

అంతేకాదు, బయోలాజికల్ గా పదేళ్ల వయస్సు తగ్గించుకున్నానని, దాంతో పదేళ్లు ఎక్కువ కాలం జీవించగలనని తనకి తాను ప్రకటించుకున్నారు.

Telugu Tips, Young, Coconut Oil, Honey, Lemon, Reduce Age-Telugu Health

డేవిడ్ సింక్లైర్ అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పోస్ట్-డాక్టరేట్, ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయంలో నుంచి ఒక డాక్టరేట్ సాధించారు.చాలా కాలంగా ఆయన హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో( Harvard University ) మనుషుల వయస్సు తగ్గింపుపై జన్యు పరిశోధనలు చేస్తూ వున్నారు.ఈ రంగంలో ఆయన చేసిన కృషికి గానూ డజన్ల కొద్దీ అవార్డులు అందుకున్నారు.

అదేవిధంగా టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా ఎంపిక అయ్యారు.ఇక ఎన్నో పేటెంట్లను పొందారు.బయోటెక్నాలజీ కంపెనీలను కొన్నిటిని స్థాపించారు.చాలా పరిశోధనల్లో భాగస్వామిగా కూడా ఉన్నారు.

తాజాగా ఈ శాస్త్రవేత్త తన డైలీ మార్నింగ్ రొటీన్ గురించి చెప్పుకొచ్చారు.

Telugu Tips, Young, Coconut Oil, Honey, Lemon, Reduce Age-Telugu Health

అయన ప్రతిరోజూ ఉదయం “కొబ్బరి నూనె”తో ఆయిల్ పుల్లింగ్ చేసుకుంటారు.తద్వారా కొబ్బరి నూనె నోటిలోని మైక్రోబయోమ్ ను మెరుగుపరుస్తుందని అంటున్నారు.రోజూ ఉదయం 20 నిమిషాల పాటు నోట్లో నూనె వేసుకుని పుక్కిలిస్తారట.

ఇది ప్రాచీన కాలంలో భారతదేశంలో అవలంబించిన పద్ధతని బిజినెస్ ఇన్సైడర్ పేర్కొనడం విశేషం.ఆయిల్ పుల్లింగ్ తర్వాత నోటిని శుభ్రం చేసుకుని.

గోరు వెచ్చని నీటిలో “నిమ్మరసం, తేనె” కలుపుకుని తాగుతారు డేవిడ్ సింక్లైర్.ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తుందని, శరీర ఛాయను మెరుగుపరుస్తుందని తెలిపారు.

ఇక ఆయన నాన్ టాక్సిక్ టూత్ పేస్ట్ తోనే పళ్లు తోముకుంటారట.అదేవిధంగా “పాలీఫెనాల్స్”తో కలిసి పెరుగు తీసుకుంటారట డేవిడ్ సింక్లైర్.

ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా, యాంటీ క్యాన్సర్, గుండె ఆరోగ్యాన్ని, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని సింక్లైర్ చెబుతున్నారు.అదేవిధంగా గ్రీన్ టీలోని ఔషధ గుణాలు కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయని సింక్లైర్ చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube