ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ( Telangana Congress ) మంచి ఊపు మీద ఉంది.కర్నాటక ఎన్నికలు ఇచ్చిన విక్టరీని తెలంగాణలో కూడా రిపీట్ చేయాలని హస్తం నేతలు దృఢ సంకల్పంతో ఉన్నారు.
ఆ దిశగానే ముందుకు సాగుతున్నారు.ఎన్నికలు మరో 5 నెలల్లో జరుగుతుండడంతో పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఈసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
అందుకోసం కర్నాటకలో ఏదైతే వ్యూహాలను అమలు చేసి అధికారం సొంతం చేసుకుందో అదే వ్యూహాలను తెలంగాణలో కూడా అప్లై చేసే విధంగా కాంగ్రెస్ సిద్దమౌతోంది.

కర్నాటక( Karnataka ) ప్రజలు కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టడానికి ప్రధాన కారణం.ఎన్నికల ముందు ఆ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో.మేనిఫెస్టో లోని చాలా అంశాలు ప్రజలను విపరీతంగా ఆకర్షించాయి.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్( 200 Units Free Electricity ).ఇలా చాలా అంశాలే ప్రజలను ఆకర్షించాయి.ఫలితంగా గంపగుత్తున ప్రజలు కాంగ్రెస్ కు అధికారాన్ని అప్పజెప్పారు.కేవలం మేనిఫెస్టో విషయంలోనే కాకుండా అప్పుడు అధికారంలో ఉన్న బిజెపి వైఫల్యాలను సైతం ఎత్తి చూపుతూ ప్రజలకు కాంగ్రెస్ ఒక్కటే దిక్కు అనే భావనా కలిగించేలా వ్యూహరచన చేశారు హస్తం నేతలు.

ఇప్పుడు సేమ్ కర్నాటక మాదిరిగానే తెలంగాణలో కూడా కేసిఆర్( CM KCR ) వైఫల్యాలను ఎండగడుతూ.అలాగే తాము అధికారంలోకి వస్తే ఏం చేయగలం అనే దానిపై ప్రజలకు పూర్తి స్పష్టతనిచ్చే విధంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.తాజాగా టి కాంగ్రెస్ నేతలతో కాంగ్రెస్ హైకమాండ్ బేటీ అయిన సంగతి తెలిసిందే.ఈ బేటీలో ప్రధానంగా కర్నాటక వ్యూహాలపైనే చర్చ జరిగినట్లు స్వయంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి( TPCC Chief Revanth Reddy ) చెప్పుకొచ్చారు.
ఇక ఇప్పటికే కేసిఆర్ పాలనపై ఘాటైన విమర్శలు చేస్తున్న హస్తం పార్టీ.సెప్టెంబర్ లో మేనిఫెస్టో ప్రకటించి అందరి దృష్టి తమవైపు తిప్పుకునేలా చేసేందుకు సిద్దమౌతోంది.మరి హస్తం పార్టీకి కర్నాటక వ్యూహాలు తెలంగాణలో ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాలి.







