ఇటీవలే కాలంలో అమ్మాయిలపై అత్యాచారాలు చేసేందుకు కామాంధులు సరికొత్త దారులను ఎంచుకుంటున్నారు.సోషల్ మీడియా పాపులర్ కావడంతో అమ్మాయిలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను అమ్మాయిలకు చూపించి బెదిరించి అత్యాచారానికి పాల్పడుతున్నారు.
ఒకవేళ ఎదురు తిరిగితే సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి లొంగ తీసుకుంటున్నారు.గత కొంతకాలంగా ఇలాంటి దారుణాలు అధిక సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి.
ఇలాంటి కోవలోనే పదవ తరగతి బాలిక, తాను ప్రేమించిన ప్రియుడితో సన్నిహితంగా ఉన్న సమయంలో ప్రియుడి స్నేహితులు ఫోటోలు, వీడియోలు తీసి ఆమెను బెదిరించి ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.ఈ ఘటన కరీంనగర్( Karimnagar ) పట్టణంలో తీవ్ర కలకలం రేపింది.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.కరీంనగర్ పట్టణంలో పదవ తరగతి చదువుతున్న ఒక బాలిక, అదే కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థితో పరిచయం ఏర్పడింది.ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.
అయితే ఇద్దరూ సమయం దొరికినప్పుడల్లా కలిసి మాట్లాడుకునేవారు.వీరి ప్రేమ ముదిరి ఇద్దరూ సన్నిహితంగా కలవడం ప్రారంభించారు.
అయితే ప్రియుడి స్నేహితులు( boyfriend’s friends ) వీరికి తెలియకుండా వీరు సన్నిహితంగా ఉండే సమయంలో ఫోటోలు, వీడియోలు తీశారు.ఆ తర్వాత ఆ యువతికి ఫోటోలు, వీడియోలు చూపించి బెదిరించి లొంగదీసుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.

అయితే ఈ విషయం తెలిసిన మరో ముగ్గురు స్నేహితులు కూడా ఆ బాలికను లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు.వీళ్ళ అరాచకాలు భరించలేక పోయిన ఆ బాలిక కుటుంబ సభ్యులకు తెలిపింది.ఆ బాలిక తల్లిదండ్రులు కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.పోలీసులు ఆ బాలిక ప్రియుడుతో పాటు ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసిన ముగ్గురిపై, ఆమెను లొంగ తీసుకోవడం కోసం ప్రయత్నించిన మరో ముగ్గురు వ్యక్తులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
అనంతరం ఆ బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు.కేసు నమోదు చేసిన వారిలో ఐదు మంది ఇంటర్ చదివే విద్యార్థులు, ఒకరు పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థి అని పోలీసులు తెలిపారు.







