శ్రీలీల కారణంగా కింద మీద పడుతున్న మేకర్స్.. అమ్మడి క్రేజ్ ఇది!

సమయం అందరికి ఒకేలా ఉండదు అనే విషయం అందరికి ఎరుకనే.ఎందుకంటే ఒకానొక దశలో సమయం మనకు బీభత్సంగా కలిసి వస్తే ఒక సమయంలో మాత్రం అస్సలు కలిసి రాదు.

 Tollywood Makers Waits For Sreeleela Details, Sreeleela, Tollywood, Guntur Kaara-TeluguStop.com

మరి ఇప్పుడు ఒక యంగ్ బ్యూటీకి మాత్రం సమయం 100 శాతం కలిసి వస్తుంది.ఆమెకు విశ్రాంతి తీసుకోవడానికి కూడా సమయం లేనంత బిజీగా ఉంది.

ఒక సమయంలో ఒక షూట్ అంటేనే కష్టం అలాంటిది ఈ బ్యూటీ చేతిలో దాదాపు డజను సినిమాలు ఉండడంతో మేకర్స్ మధ్య గందరగోళం ఏర్పడింది.ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలిసే ఉంటుంది.

యంగ్ బ్యూటీ శ్రీలీల.( Sreeleela ) ఈ భామ టైం ఇప్పుడు ఎలా నడుస్తుందంటే ఈమె కాల్ షీట్స్ దొరకక సినిమాల షెడ్యూల్స్ సైతం మార్చుకోవాల్సి వస్తుందట.

రవితేజ ధమాకా సినిమాతో( Dhamaka ) బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ భామ ఇప్పుడు స్టార్ హీరోలతో నటిస్తూ బిజీగా ఉంది.ప్రస్తుతం ఈ భామ చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.ఒక సినిమాకు సమయం ఇస్తే మరో సినిమా మేకర్స్ ఈమె కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది.ఈ భామ మహేష్ బాబు గుంటూరు కారం( Guntur Karam ) చేయడం కోసం బాలయ్య భగవంత్ కేసరి( Bhagavant Kesari ) సినిమా డేట్ లు అప్పు తీసుకోవాల్సి వచ్చింది.

ఇక వైష్ణవ్ తేజ్ సినిమాకు 10 రోజుల టాకీ చేయడానికి కుదరక ఆదికేశవ సినిమా ఆపాల్సి వచ్చిందట.ఇప్పటికే ఈమె చేతిలో చాలా సినిమాలు ఉండగా మరిన్ని కమిట్ అవుతూ చిన్న వయసులోనే బిజీ హీరోయిన్ అయిపొయింది.ఈమె కాల్ షీట్స్ సర్దలేక మేకర్స్ కింద పైన అవుతున్నారట.అప్పట్లో మహానటి సావిత్రి గారు ఇలా చేసేవారట.ఇప్పుడు మళ్ళీ ఇంత కాలానికి శ్రీలీల కూడా ఆ రేంజ్ లో సత్తా చాటుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube