రాజన్న సిరిసిల్ల జిల్లా : రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎల్లారెడ్డిపేట మండలంలో ఉన్న పాఠశాలలను సంపూర్ణంగా బందు చేశారు.పాఠశాలల బందు విజయవంతమైందని ఏబీవీపీ నాయకులు అన్నారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దశాబ్ది కాలం గడిచిన కూడా ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాల వరకు పూర్తిగా విద్యను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు.నిర్బంధ విద్య అంటూ ప్రకంపనలు పలికి వారి హామీలను అమలు చేయకుండా రెగ్యులరైజేషన్ పేరు మీద 8,624 ప్రభుత్వ పాఠశాలలు మూసివేసారని ఆరోపించారు.
ప్రభుత్వ పాఠశాలలు గాలికి వదిలేసి కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని జలగల పిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించు కోవడంలేదని ఆరోపించారు.ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని విద్యార్థి జీవితాల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న అక్రమంగా నడుస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలని, అభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో , నవీన్ రెడ్డి, వెంకటేష్, రాకేష్,శివ, సర్వేశవర్ మహేష్ శ్రీకాంత్,సాయికృష్ణ, ప్రశాంత్,వరుణ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.







