వంట చేయడం అనేది ఒక కళ.సరైన రుచి, సువాసన వచ్చేలా వంట చేశామంటే ఆ కళ అద్భుతంగా ఉన్నట్లే అని అర్థం చేసుకోవచ్చు.
అయితే వంట ప్రక్రియ ఒక సైన్స్.మీరు వంట చేసేటప్పుడు ఏదైనా కూరల మీద నురుగు లాంటి పదార్థం ఏర్పడడం గమనించారా.
పప్పు లేదా ఇతర కాయ దాన్యాలు వండినప్పుడు ఈ సబ్బు లాంటి నురగ కనిపిస్తుంది.అది ఉడికేటప్పుడే అలా వస్తుందిలే అనుకుని దాన్ని తినేస్తారు.
కానీ అది మానవ వినియోగానికి అసలు మంచిది కాదు.ఈ నురుగు ప్రజల ఆరోగ్యానికి హాని చేస్తుందని ఆరోగ్య నిపుణులు( Health professionals ) చెబుతున్నారు.

మూత తీసి ఉన్న దాంట్లో పప్పు, కూరలు( Curries ) వండుతున్నప్పుడు, లేదంటే ఉడకబెడుతున్నప్పుడు సబ్బు లాంటి నురగ అవశేషాలు కనిపిస్తాయి.వాటిని తీసేయడమే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.ఒక అధ్యయనం ప్రకారం పప్పు లేదా కాయగూరలు వండేటప్పుడు కనిపించే నురుగు సపోనిన్ తో తయారు చేయబడి ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే పప్పులో సపోనిన్ అనే గ్లైకోసైడ్ ఉంటుంది.
ఈ పదార్థం నీటితో కలిసినప్పుడు కరిగిపోతుంది.ఈ సపోనిన్ లు సబ్బుతో సహజమైన లక్షణాలు కలిగి ఉంటాయి.
అవి ఉడికేటప్పుడు గాలిని తీసుకొని ఫోమ్ మాదిరిగా ఏర్పడతాయి.

ఇంకా చెప్పాలంటే పప్పు ఉడికేటప్పుడు అందులోని ప్రోటీన్లు విడుదల అవుతాయని మరొక సిద్ధాంతం చెబుతుంది.వేడి నీరు తగిలినప్పుడు అందులోని వాయువులు ఉపరితం మీద నురుగులా ఏర్పడతాయి.దీన్నే ప్రోటీన్ డీనాటరేషన్( Protein denaturation ) అని అంటారు.
ఇలా పప్పు ఉడికేటప్పుడు కనిపించే నురుగు హానికరమా అంటే అవునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే ఇది గ్లైకోసైడ్ సహజ నిర్మాణాన్ని దెబ్బతీస్తుంది.
ఇటువంటి పదార్థాన్ని తీసుకోవడం హానికరం.అందుకే తినే ముందు ఉపరితలం మీద ఏర్పడిన నురుగు తొలగించడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.