దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటి కీర్తి సురేష్( Keerthy Suresh ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ప్రస్తుతం ఈమె తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
తాజాగా నాని సరసన నటించిన దసరా సినిమా( Dasara Movie ) ద్వారా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నటువంటి కీర్తి సురేష్ త్వరలోనే తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు మంత్రి ఉదయనిది స్టాలిన్ (Udayanidhi Stalin) తో కలిసి నటించిన మామన్నన్ ( Mamannan ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

ఇలా ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కీర్తి సురేష్ కి రాజకీయాల గురించి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలోనే భవిష్యత్తులో మీరు కూడా రాజకీయాలలోకి వచ్చే ఆలోచనలలో ఏమైనా ఉన్నారా అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు కీర్తి సురేష్ సమాధానం చెబుతూ.

ఈ సినిమాలో నా పాత్ర చాలా సీరియస్ గా ఉండబోతుందని తెలిపారు.ఇక గత కొంతకాలంగా తనకు ఈ తరహా పాత్రలే వస్తున్నాయని తెలిపారు.ఈ క్రమంలోనే తనను రాజకీయాల గురించి కూడా చాలా మంది రాజకీయాల్లోకి రాబోతున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారని, అయితే తాను ఆ విషయం గురించి ఆలోచించాల్సి ఉంటుంది అంటూ సమాధానం చెప్పారు ఇలా పొలిటికల్ ఎంట్రీ ( Political Entry )గురించి ఆలోచించాలి అంటూ కీర్తి సురేష్ సమాధానం చెప్పడంతో ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా ఈమె రాజకీయాలలోకి తప్పకుండా వస్తుందని పలువురు భావిస్తున్నారు.అయితే గతంలో కూడా ఒకసారి కీర్తి సురేష్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఇలాంటి వార్తలు వచ్చిన విషయం మనకు తెలిసిందే.
అయితే అప్పుడు కీర్తి సురేష్ తల్లి ఈ వార్తలను తిప్పి కొట్టారు.







