అమ్మాయిలు మౌనంగా ఉన్నంతవరకే కామాంధులు రెచ్చిపోతారు.ఒక్కసారి అమ్మాయిలు ఎదురు తిరిగితే వారు ఎంతటి వారైనా తోక ముడుచుకుని పారిపోతారు.
ధైర్యవంతులైన చాలా మంది అమ్మాయిలు ఇలాంటి నీచులకు బహిరంగంగా బుద్ధి చెప్పారు.ఇప్పుడు ఆ తరహా సంఘటన మరొకటి చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.అహ్మదాబాద్‌లోని బెహ్రాంపూర్( Behrampur )కు చెందిన 17 ఏళ్ల బాలికను విజయ్ సర్కాటే( Vijay Sarkate ) అనే యువకుడు రోజూ వెంబడించి ఇబ్బంది పెడుతున్నాడు.
అయితే అతడి ఆగడాలు భరించలేక ఆ బాలిక స్వయంగా అతడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది.
ఆమె అక్క కూడా ఈ కామాంధుడు గురించి తెలుసుకొని ఆగ్రహంతో ఊగిపోయింది.
అదును చూసుకొని వారు ఇతర విద్యార్థులతో కలిసి ఆ యువకుడిని పట్టుకున్నారు.తర్వాత తమ స్కూల్ బెల్ట్‌లతో చితకబాదారు.
బాగా దెబ్బలు తగలడంతో సదరు యువకుడు లేచి నిలబడలేకపోయాడు.రోడ్డుపై దొర్లుతూ కనిపించాడు.
ఈ సమయంలో బాధిత బాలిక అతడిని బూట్ కాలితో తన్నుతూ అతడు ఎప్పటికీ మర్చిపోలేని గుణపాఠం నేర్పించింది.
మరోవైపు ఆ వ్యక్తి తన చిన్న కుమార్తెను రోజూ వెంబడిస్తున్నాడని బాలికల తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఓ రోజు తన చిన్న కూతురు సైకిల్‌పై స్కూల్‌కి వెళ్తుండగా, ఆ వ్యక్తి ఆమె చేతిని బలవంతంగా పట్టుకుని బహుమతి ఇవ్వడానికి ప్రయత్నించాడని చెప్పుకొచ్చింది.ఆ గిఫ్ట్ తీసుకోవడానికి తన కూతురు నిరాకరించడంతో, అతను దానిని ఆమె బ్యాగ్‌లో పెట్టి, అనుమతి లేకుండా ఆమెను ముద్దు పెట్టుకున్నాడని వెల్లడించింది.
ఈ ఘటనతో తన చిన్న కూతురు ఇంటికి వెళ్లి చాలా ఏడ్చిందని తెలిపింది.
మరుసటి రోజు ఆ వ్యక్తి మళ్లీ వచ్చి చిన్న అమ్మాయిని అడ్డుకుని, ఆమె చేయి పట్టుకున్నాడని, అక్కడే ఉన్న అక్క ఇది చూసి అతడిని కొట్టడం ప్రారంభించిందని తల్లి వెల్లడించింది.ఇంతలోనే తోటి స్టూడెంట్స్, స్థానికులందరూ అక్కడికి వచ్చి బాలికలకు మద్దతుగా నిలిచారు.ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు( Police ) ఆ వ్యక్తిపై రిపోర్టు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు.