తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న కొద్దిమంది పెద్ద హీరోల్లో రవితేజ( Raviteja ) ఒకరు ఈయన చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్ మెంట్ ని అందిస్తుంది…ఒక్కోసారి కధల ఎంపికలో పొరపాటు జరిగి సినిమా కాస్త నిరాశపరచిన రవితేజ పెరఫామెన్స్ పరంగా ఎప్పుడు అభిమానులను నిరాశ పరచలేదు.దాదాపుగా 60 సినిమాలకు పైగా చేసిన రవితేజ టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకొనే హీరోలలో ఒకడిగా ఉన్నాడు.అంతేకాక ఈ మధ్య కొన్ని బ్రాండ్స్ కి అంబాసిడర్ గా మారి అభిమానులకు మరింతగా చేరువ అయ్యాడు…
50 సంవత్సరాల వయస్సులో కూడా కుర్ర హీరోలకు దీటుగా నటిస్తున్నాడంటే రవితేజ ఫిట్ నెస్ ని ఎంతలా కాపాడుకుంటాడో అర్ధం చేసుకోవాలి.కాస్త విరామం తీసుకోని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రవితేజ రాకెట్ లా దూసుకుపోతున్నాడు.ఇక రవితేజ వ్యక్తిగత విషయానికి వస్తే… రవితేజ తన కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు.తన స్టార్ ఇమేజ్ కారణంగా తన కుటుంబానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తపడతాడు రవితేజ.
అందుకే రవితేజ భార్య,పిల్లలు ఎలా ఉంటారో కూడా ఎవరికీ తెలియదు…
ఈ మధ్య సోషల్ మీడియాలో రవితేజ భార్య,పిల్లల ఫోటోలను పోస్ట్ చేసే వరకు ఎవరకు తెలియదు.అంతలా జాగ్రత్తలు తీసుకుంటాడు.రవితేజ పెద్దలు కుదురిచ్చిన కళ్యాణి( Raviteja Wife Kalyani )ని వివాహం చేసుకున్నాడు.2002 వ సంవత్సరంలో మే 26 న తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో రవితేజ వివాహం జరిగింది.అప్పట్లో రవితేజ వివాహానికి పూరి జగన్నాథ్,కృష్ణ వంశీ ,శివాజీ రాజా తదితరులు హాజరు అయ్యారు.కళ్యాణి రవితేజకు చిన్నప్పటి నుండి తెలిసిన అమ్మాయే.
ఎందుకంటే కళ్యాణి రవితేజకు స్వయానా మేనమామ కూతురు.కళ్యాణి రవితేజకు చిన్నప్పటినుండి తెలిసిన అమ్మాయి.అయితే రవితేజకు, ఆయన భార్యకు మధ్య ఏజ్ గ్యాప్( Age Gap ) తెలిస్తే షాకైపోతారు.ఎందుకంటే, వీరిద్దరి మధ్య దాదాపు 13 ఏళ్లు వయసు వ్యత్సాసం ఉంటుంది.
అవును, కళ్యాణి కంటే రవితేజ 13 ఏళ్లు పెద్దవాడు.రవితేజ వయసు 55 కాగా.
కళ్యాణి వయసు 42.కానీ, అప్పట్లో వయసు పెద్దగా పట్టించుకునేవారు కాదు…అయితే ప్రస్తుతం రవితేజ చాలా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు…