Director Sivanagu Suman: హీరో సుమన్ కి క్షమాపణలు చెప్పిన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరో సుమన్( Hero Suman ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగాడు.

 Director Narra Sivanagu Apologized Hero Suman-TeluguStop.com

ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుమన్.ఎక్కువగా యాక్షన్ చిత్రాలతో పాటుగా కుటుంబ కథ చిత్రాలను కూడా నటించి మెప్పించాడు.

తెలుగుతో పాటు తమిళం, కన్నడ సినిమాలలో కూడా నటించి మెప్పించాడు.లేకపోతే ప్రస్తుతం సుమన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం సుమన్ చేతిలో నాలుగైదు సినిమాలు వెబ్ సిరీస్ లు కూడా ఉన్నాయి.ఇప్పటివరకు సుమన్ దాదాపుగా 750 కి పైగా సినిమాలలో నటించి మెప్పించారు.ఇది ఇలా ఉంటే తాజాగా హీరో సుమన్ కి సంబంధించి ఒక వార్త చెక్కర్లు కొడుతోంది.అదేమిటంటే.

ఇటీవలే దర్శకుడు శివనాగు( Director Narra Sivanagu ) హీరో సుమన్ గురించి మాట్లాడుతూ ఆడియో ఫంక్షన్ కు రావాలి అని పిలిస్తే రెండు లక్షలు డిమాండ్ చేశాడు అంటూ సంచలన ఆరోపణలు చేసిన విషయం అందరికీ తెలిసిందే.అయితే తాజాగా ఈ వ్యాఖ్యలపై స్పందించారు డైరెక్టర్ శివనాగు.

ఈ సందర్భంగా తాను చేసిన వాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.

Telugu Narra Sivanagu, Suman, Nataratnalu, Sumansivanagu, Tollywood-Movie

నటరత్నాలు చిత్రం( Nataratnalu Movie ) ఆడియో ఫంక్షన్‌ వేదికగా సుమన్‌ పై చేసిన వ్యాఖ్యలకు శివనాగు క్షమాపణ తెలిపారు.అందుకు సంబంధించిన వీడియో ని కూడా సోషల్ మీడియాలో విడుదల చేశాడు.ఆ వీడియోలో శివనాగు మాట్లాడుతూ సుమన్‌ గారు నా కుటుంబానికి ఎంతో కావాల్సిన వ్యక్తి.

ఆయనతో మూడు సినిమాలు చేశాను.నా పిల్లలు ఇద్దరు నిర్మిస్తున్న నట రత్నాలు,చిత్రం ఆడియో ఫంక్షన్‌కు ఆయన్ని ఆహ్వానించి, సన్మానించాలనుకున్నాను.

Telugu Narra Sivanagu, Suman, Nataratnalu, Sumansivanagu, Tollywood-Movie

ఆయన్ను పిలిచే క్రమంలో మేకప్‌మెన్‌ వెంకట్రావు చెప్పడం సమస్యో, నేను వినడం పొరపాటో తెలీదు కానీ ఫంక్షన్‌ టెన్షన్‌లో ఉండి సుమన్‌ గారిపై ఆరోపణలు చేశాను.దీనిపై చాలామంది నిర్మాతలు నాకు ఫోన్‌ చేసి మాట్లాడారు.అప్పుడు గానీ నేను పొరపాటు మాట్లాడానని గమనించలేదు.మీడియా ముఖంగా సుమన్‌ గారికి మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నాను అని తెలిపారు శివనాగు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube