కొత్త కారు కొనేవారికి అలర్ట్.. ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి..

కొత్త కారును( New Car ) కొనుగోలు చేయడమనేది ప్రతీ ఒక్కరి జీవితంలో ఒక కీలక మైలురాయి అని చెప్పవచ్చు.చాలా పెట్టుబడి పెట్టి ఎంతో కాలం పాటు వినియోగించే కారు కొనుగోలు విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

 Keep These 5 Things In Mind While Buying A New Car Details, Car, Car Buying Guid-TeluguStop.com

భారతదేశంలో ఉన్నా లేదా మరే ఇతర దేశంలో అయినా, కొత్త కారును కొనుగోలు చేసే ప్రక్రియలో పరిగణనలోకి తీసుకోవలసిన అంశాలు అనేకం ఉంటాయి.వాటిలో ఐదు ముఖ్యమైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1.బడ్జెట్, స్థోమత:

కారు కొనుగోలు చేసేటప్పుడు బడ్జెట్, స్థోమత( Budget ) అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.ఆర్థిక భారం లేకుండా కొత్త కారు కోసం ఎంత ఖర్చు చేయగలరో నిర్ణయించాలి.కారు కొనుగోలు ధరతో పాటు, బీమా, రిజిస్ట్రేషన్ ఫీజులు, పన్నులు, నిర్వహణ ఖర్చులు వంటి అదనపు ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలి.ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఏ కారు మీకు ఉత్తమమో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.

2.వాహనం రకం, ప్రయోజనం:

మీ అవసరాలు, ప్రయోజనానికి బాగా సరిపోయే వాహన రకాన్ని ఎంచుకోవాలి.సిటీ డ్రైవింగ్ కోసం మీకు కాంపాక్ట్ కారు, కుటుంబ విహారయాత్రల కోసం విశాలమైన ఎస్‌యూవీ( SUV ) లేదా సుదీర్ఘ ప్రయాణాలకు శక్తివంతమైన సెడాన్( Sedan ) అవసరమవుతుంది.

మీ ప్రాధాన్యతలకు అనుగుణంగా, మీకు అవసరమైన ఫీచర్లు మరియు సామర్థ్యాలను అందించే వాటిని కనుగొనడానికి వివిధ కారు మోడళ్లను చాలా రోజులపాటు చెక్ చేసి తెలుసుకోండి.

Telugu Automobile, Car Budget, Car, Car Tips, Car Mileage, Car Reviews, Car Secu

3.ఇంధన సామర్థ్యం, నిర్వహణ ఖర్చులు:

ఇంధన సామర్థ్యం అనేది ఒక క్లిష్టమైన అంశం, ముఖ్యంగా ఇంధన ధరలు ఎక్కువగా ఉన్న మన దేశంలో మంచి మైలేజీని అందించే కార్ల కోసం వెతకాలి.లేదా హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల వంటి వాటిని పరిశీలించాలి.

కారు సగటు ఇంధన వినియోగం, నిర్వహణ ఖర్చులు మరియు విడిభాగాల లభ్యతను అంచనా వేయాలి.దీర్ఘకాలంలో దాని నిర్వహణ ఖర్చులను మీరు భరించగలరా అనే కోణంలో కూడా ఆలోచించాలి.

Telugu Automobile, Car Budget, Car, Car Tips, Car Mileage, Car Reviews, Car Secu

4.సేఫ్టీ ఫీచర్లు:

కొత్త కారును కొనుగోలు చేసేటప్పుడు భద్రతకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇవ్వాలి.ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), రియర్ వ్యూ కెమెరాలు, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్, అధునాతన డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టమ్‌లు (ADAS) వంటి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు ఉన్న వాహనాలనే ఎంచుకోవాలి.కొనే కారుకి సంబంధించి క్రాష్ టెస్ట్ రేటింగ్‌లు, సేఫ్టీ డాక్యుమెంట్స్ పరిశీలించాలి.

Telugu Automobile, Car Budget, Car, Car Tips, Car Mileage, Car Reviews, Car Secu

5.పరిశోధన, పోలిక:

తుది నిర్ణయం తీసుకునే ముందు, సమగ్ర పరిశోధన నిర్వహించి, విభిన్న కారు మోడళ్లను సరిపోల్చాలి.కారు పనితీరు, మన్నిక, కస్టమర్ సంతృప్తిపై అవగాహన పొందడానికి నిపుణుల రివ్యూలు, యూజర్లు రివ్యూలు, రేటింగ్స్‌ను చెక్ చేయాలి.తద్వారా ఫలానా కారు కొనుగోలు చేయాలా వద్దా అనే విషయాన్ని నిర్ణయించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube