జూన్ 20వ తారీకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్…( Ram Charan ) ఉపాసనకి ( Upasana ) పాప జన్మించడం తెలిసిందే.పెళ్లయిన 11 సంవత్సరాల తర్వాత బిడ్డ జన్మించటంతో మెగా కుటుంబంలో పండగ వాతావరణం ఏర్పడింది.
జూన్ 20వ తారీకు నుండి మొన్నటిదాకా భారీ ఎత్తున అభిమానులు మరియు కుటుంబ సభ్యులు చరణ్ తండ్రి కావటం పట్ల పాప జన్మించడం పట్ల సంబరాలు చేసుకున్నారు.ఉపాసన డెలివరీ అయిన జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రి ప్రాంగణం వద్ద అభిమానులు భారీ ఎత్తున కటౌట్లు కట్టి.
భారి హడావుడి చేశారు.ఇదిలా ఉంటే నిన్నే జూన్ 23వ తారీకు హాస్పిటల్ నుండి ఉపాసన డిశ్చార్జి కావడం తెలిసిందే.

ఈ క్రమంలో ట్విట్టర్ ఎకౌంటులో చరణ్ పాపతో( Ram Charan Daughter ) తాను దిగిన ఫోటోని తాజాగా పోస్ట్ చేసి పాపకు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన ప్రతి ఒక్కరికి ఉపాసన కృతజ్ఞతలు తెలియజేశారు.“మా చిన్నారి పాపకి ఆత్మీయ స్వాగతం పలికిన మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు” అనీ తెలపడం జరిగింది.దీంతో ట్విట్టర్ లో పాపతో ఉపాసన.చరణ్ కలిసి దిగిన ఫోటో పోస్ట్ చేయడంతో ఫోటో వైరల్ అవుతూ ఉంది.ఇదిలా ఉంటే మరికొద్ది రోజుల్లో నామకరణం కార్యక్రమం భారీ ఎత్తున చేయడానికి మెగా ఫ్యామిలీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.







