వరంగల్ జిల్లాలోని కాకతీయ మెడికల్ కాలేజీలో ఓ విద్యార్థిని నిద్రమాత్రలు వేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఘటన కలకలం సృష్టిస్తుంది.ఆర్థోపెడిక్ రెండో సంవత్సరం చదువుతున్న లాస్య అనే విద్యార్థిని తీవ్రమైన తలనొప్పి రావడంతో మోతాదుకు మించి నిద్రమాత్రలు వేసుకున్నట్లు తెలుస్తోంది.
గత కొన్ని రోజులుగా లాస్య మైగ్రేన్ తో బాధపడుతున్నట్లు సమాచారం.ఈ క్రమంలో ఎక్కువ నిద్రమాత్రలు వేసుకోవడంతో విద్యార్థిని అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
ప్రస్తుతం బాధిత విద్యార్థినికి ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.అయితే విద్యార్థిని లాస్య పరిస్థితి నిలకడగానే ఉందని ప్రిన్సిపాల్ వెల్లడించారు.