వాన కాలం( Rainy season )లో చాలా జాగ్రత్తగా ఉండాలి.అయినప్పటికీ కూడా వర్షాకాలం అన్నాక వ్యాధులు వస్తూ ఉంటాయి.
అందుకే ఆహారం విషయంలో చాలా ఆలోచించి జాగ్రత్తలు తీసుకోవాలి.ఆరోగ్యం మీద చాలా ధ్యాస పెట్టాలి.
ఆరోగ్యానికి మేలు జరిగే విధంగా ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి.అయితే ఈ కాలంలో కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వలన అసలు మంచిది కాదు.
ఆ పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.వానా కాలంలో పానీ పూరీలు అస్సలు తినకూడదు.
ఎందుకంటే పాని పూరి నీరు కలుషితమయ్యే అవకాశం ఉంటుంది.కడుపులో ఇబ్బంది, విరేచనాలు లాంటి ఇబ్బందులు కలగవచ్చు.
అలాగే ఈ కాలంలో ఇలాంటి పదార్థాలను తీసుకోవడం అంత మంచిది కాదు.వర్షాకాలంలో పచ్చి కూరగాయలు( Vegetables ) కూడా తీసుకోకూడదు.ఈ కాలంలో పచ్చి కూరగాయలను తీసుకోవడం వలన గ్యాస్, ఎసిడిటీ( Acidity ) లాంటి సమస్యలు వస్తాయి.ఇక చాలామంది వర్షాలు మొదలైనప్పటి నుంచి చేపలు, రొయ్యలు లాంటివి తీసుకుంటూ ఉంటారు.
అయితే వర్షాలు పడుతుంటే అవి సంతానాభివృద్ధి చేస్తూ ఉంటాయి.ఇలాంటి సమయంలో వాటిని తీసుకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.
అలాగే వర్షాకాలంలో పుట్టగొడుగులని( Mushroom) కూడా అస్సలు తీసుకోకూడదు.
ఎందుకంటే ఈ కాలంలో బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని ఇవి తీసుకొస్తాయి.అంతేకాకుండా ఫ్రై చేసిన ఆహార పదార్థాలను కూడా అసలు తీసుకోకూడదు.ఇక మామిడి పండ్లను కూడా తీసుకోకూడదు.
ఇలా తీసుకుంటే పితా, వాత, దోషాలు ఎక్కువ అవుతాయి.ఇక మొటిమలు( Acne) కూడా ఎక్కువగా వస్తాయి.
వర్షాకాలంలో పళ్ళ రసాలను తీసుకోవడం వలన ఇబ్బందులు కలుగుతాయి.ఇక వర్షాకాలంలో మసాలా ఆహారాన్ని అస్సలు తీసుకోకూడదు.
వీలైనంతవరకు వేడి వేడి ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాలి.గోరువెచ్చని నీటిని తీసుకోవా.
లి ఇక పిల్లల ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.