ఇటీవలే జరుగుతున్న అనుమానాస్పద మరణాలలో( Suspicious Deaths ) సగానికి పైగా దారుణమైన హత్యలుగా వెలుగులోకి వస్తున్నాయి.నేటి సమాజంలో మానవత్వం అనే మాటను మరిచి శారీరక సుఖం కోసం, ఆస్తుల కోసం కుటుంబ సభ్యులనే దారుణంగా హత్య చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతోంది.
గతంలో శత్రువులు అనేవారు బయట ఉండేవారు.కాలం మారింది ప్రస్తుతం కుటుంబ సభ్యులే శత్రువులుగా మారి హత్యలకు పాల్పడుతున్నారు.
ఈ క్రమంలో శారీరక సుఖం కోసం ఏర్పడే వివాహేతర సంబంధాలు( Illegal Relationships ) అన్ని దాదాపుగా చివరికి తీవ్ర విషాదంగా ముగుస్తున్నాయి.సమాజంలో వివాహేతర సంబంధానికి ఇచ్చే విలువ వివాహ బంధానికి ఇవ్వడం లేదు.
ఇలాంటి కోవలోని ఓ వివాహిత తన ప్రియుడి మోజులో పడి భర్తను దారుణంగా హత్య చేసింది.అయితే ఈ హత్య సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆ వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.కర్ణాటకలోని ( Karnataka ) బెలగావి పట్టణంలోని అంబేద్కర్ నగర్లో రమేష్ కంబాలే, సంధ్య దంపతులు నివాసం ఉంటున్నారు.సంధ్యకు బాలు బిరేంజె అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.
కొంతకాలం వీరి వివాహేతర సంబంధం సాఫీగానే సాగింది.కానీ సంధ్య మాత్రం భర్త అడ్డును తొలగించుకొని హాయిగా ప్రియుడితో వివాహేతర సంబంధాన్ని సంతోషంగా గడపాలని అనుకుంది.

అందుకోసం ఒక మాస్టర్ ప్లాన్ రచించి భర్త రమేష్ కంబాలేను ఈ ఏడాది మార్చిలో హత్య చేసింది.ఆ తరువాత ఒక నెలకు తన భర్త రమేష్ కంబాలే కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.తన భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని తనను ఒంటరిచేసి వెళ్లిపోయాడని అందరూ నమ్మేలాగా కట్టుకథ అల్లింది.పోలీసులు అన్ని కోణాల్లో విచారించగా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది.
కానీ తాజాగా రమేష్ ఫోన్ ఇంట్లోనే ఉండడంతో కుటుంబ సభ్యులకు సంధ్య పై అనుమానం వచ్చి పోలీసులకు ఈ విషయాన్ని తెలిపారు.పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.







