జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర( Varahi yatra ) ద్వారా ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడతున్నారు.వైసిపి కీలక నేతలందరినీ టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు.
చివరకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ను టార్గెట్ చేసుకుని పవన్ ( Pawan kalyan )చేస్తున్న విమర్శలతో అధికార పార్టీ వైసిపి ఉలిక్కి పడుతోంది.ఉభయగోదావరి జిల్లాలో కీలకంగా ఉన్న కాపు సామాజిక వర్గం ఈసారి పూర్తిగా పవన్ ట్రాప్ లోకి వెళ్లిపోయిందనే సర్వే నివేదికలతో వైసిపి అలెర్ట్అ వుతోంది.
అందుకే పవన్ చేస్తున్న విమర్శలకు కాపు సామాజిక వర్గం కు చెందిన వైసిపి నాయకులతోనూ, అలాగే ముద్రగడ పద్మనాభం ను తెరపైకి తీసుకువచ్చి పవన్ పై విమర్శలు చేస్తున్నారు.గత కొద్ది రోజులుగా ముద్రగడ, పవన్ కళ్యాణ్ కు మధ్య ఈ రకమైన వార్ జరుగుతుంది.
జనసేన నాయకులు , కార్యకర్తలు ముద్రగడను టార్గెట్ చేసుకుని మీడియా, సోషల్ మీడియాలో విమర్శలు చేస్తుండగా, ముద్రగడ వర్గం కూడా అంతే స్థాయిలో జనసేన పైన, పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి లేఖలు కూడా విడుదల చేస్తున్నారు.

అందులో అనేక ప్రశ్నలు సంధిస్తుండడం, వాటికి సమాధానాలు చెప్పాలంటూ నిలదీస్తూ ఉండడం వంటివి పవన్ కు ఇబ్బందికరంగా మారాయి.వంగవీటి రంగా హత్య ఉదంతం దగ్గర నుంచి ఇప్పటి వరకు కాపు సామాజిక వర్గానికి జరిగిన అన్యాయాల పైన ముద్రగడ( Mudragada Padmanabham ) ప్రశ్నలు వేస్తున్నారు.తాను కాపు ఉద్యమాన్ని వదిలిపెట్టేసానని, పోనీ పవన్ దానిని ఎందుకు ముందుకు తీసుకు వెళ్ళలేదు అంటూ ముద్రగడ ప్రశ్నిస్తున్నారు.అసలు కాపు సామాజిక వర్గానికి పవన్ ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు.
దీంతో కాపు సామాజిక వర్గంలోనే ముద్రగడ , పవన్ వర్గాలుగా చీలిక అయితే వచ్చింది.

వైసిపి కూడా ఇదే కోరుకుంది.కాపు సామాజిక వర్గంలో ఏదో రకంగా చీలిక తీసుకువస్తేనే జనసేన ను బలహీనం చేయవచ్చని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గోదావరి జిల్లాలో ఇబ్బందికర పరిస్తితులు ఏర్పడతాయని అంచనా వేసింది.అందుకే కాపు ఓట్లలో చీలిక తీసుకొచ్చే విధంగా ముద్రగడను తెరపైకి తీసుకు వచ్చినట్టుగా అర్థం అవుతోంది.
పవన్ గ్రాఫ్ ఎంతవరకు తగ్గిస్తే అంతగా తమకు మేలు చేకూరుతుందనే ఆలోచనతో వైసీపీ ఉంది.







