ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh )రాష్ట్రంలో రాజకీయాలు చాలా వాడి వేడిగా జరుగుతున్నాయి.ప్రధాన పార్టీల నాయకులు ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా వ్యూహాలతో రెడీ అవుతున్నారు.
ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం కీలక నాయకులు చంద్రబాబు( Chandrababu ) అదేవిధంగా లోకేష్ ఇప్పటికే వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు చేస్తూ ఉన్నారు.ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా “భవిష్యత్తుకు గ్యారెంటీ” పేరిట కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఇటీవల జరిగిన మహానాడులో విడుదల చేసిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ నాయకులు ప్రజలలోకి తీసుకెళ్లే రీతిలో ఈ కార్యక్రమాన్ని టీడీపీ ( TDP )అధినాయకత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంది.
దీనిలో భాగంగా ఏలూరు జిల్లా నూజివీడు నందు నిర్వహించిన భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది.
విషయంలోకి వెళ్తే నూజివీడు సమీపంలో నిర్వహిస్తున్న భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బహిరంగ సభా వేదికపై చాలామంది నాయకులు కూర్చోవడం జరిగింది.ఈ క్రమంలో వేదికపై మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రసంగిస్తూ ఉండగా ఒక్కసారిగా వేదిక కుప్ప కూలిపోవడంతో.
పలువురు నాయకులు స్వల్పంగా గాయపడ్డారు.వేదికపై మాజీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, గంటా మురళి, గన్ని, ముద్ర బోయిన తదితరులు ఉన్నారు.