ఆది పురుష్( Adi Purush ).మూడు నాలుగు రోజుల్లోనే ఈ సినిమా చరిత్ర ముగిసి పోతుంది.
వందల కోట్ల బడ్జెట్ తో, భారీ గ్రాఫిక్స్ తో, విపరీతమైన హైప్ తో విడుదలైన ఈ చిత్రం వారం కూడా సరిగ్గా నడవకుండానే థియేటర్స్ నుంచి వెళ్ళిపోతోంది.ఇంతకన్నా దారుణమైన డిజాస్టర్ ఫలితం ఇటీవల కాలంలో ప్రభాస్( Prabhas ) కి దక్కలేదంటే నమ్మండి.
నిజానికి ప్రభాస్ కానీ అడిపురుష్ టీం కానీ దీనికి బాధ్యులు కారు.కేవలం ఈ చిత్ర దర్శకుడు ఓం రౌత్ మాత్రమే ఈ ఫెయిల్యూర్ కి పూర్తి స్థాయి బాధ్యుడు.
ఈ సినిమా ట్రైలర్ కి వచ్చిన స్పందన చూసిన తర్వాత ప్రభాస్ కాస్త జోక్యం చేసుకొని జాగ్రత్తపడి ఉంటే బాగుండేది.జరిగిన పొరపాట్లను దిద్దుబాటు చేసుకుంటే ఇంకా బాగుండేది.

కానీ అందరి హీరోలాగానే ప్రభాస్ కూడా దర్శకుడుని మాత్రమే నమ్మి ఘోరంగా మోసపోయాడు.ఇక ఈ తలతిక్క వ్యవహారాలకు తోడు సినిమా టీం లో ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించడంతో పైత్యం బాగా ముదిరి పోయిందని అందరూ అనుకున్నారు.ఇక సినిమాకి సంబంధించినంత వరకు బాగా మొదటి నుంచి బాగా హైప్ ఉదంతం తో మొదటి రోజు 90 కోట్ల వసూలు సాధించగలిగిన ఈ చిత్రం అలాగే సినిమా కంటెంట్ కూడా బాగానే ఉంటే వెయ్యి కోట్లు ఈజీగా కలెక్ట్ చేసేది.కానీ 350 కోట్లు కూడా దాటడం కష్టంగా మారింది.
మొదటి రోజుతో పోలిస్తే రెండవ రోజు మూడవరోజు దారుణమైన ఫలితాలను చూడాల్సి వచ్చింది.ఇక శని, ఆదివారాలపై దర్శక నిర్మాతలు ఆశ పెట్టుకున్నారు.

ఈ రెండు రోజులు కూడా దాటి పోతే ఇక ఆ రాముడు తప్ప ఎవరు ఈ సినిమాను కాపాడ లేరు.పాన్ ఇండియా చిత్రమైనప్పటికీ కేరళలో ఏడు రోజుల్లో ఒక కోటి 22 లక్షల వసూళ్లు మాత్రమే సాధించింది.ఇక తమిళంలో కూడా అదే రేంజ్ లో వరం రోజులకి 3.5 కోట్ల రూపాయలు వసూళ్లు అయ్యాయి.కన్నడ విషయానికొస్తే కూడా అంతే మొత్తం వారం రోజుల్లో 1.92 కోట్ల రూపాయల వసూళ్లు మాత్రమే దక్కింది.ఈ మూడు భాషలతో పోలిస్తే తెలుగు కాస్త మినహాయింపు.ప్రభాస్ తెలుగు వాడు కావడం అందుకు గల ముఖ్య కారణం.







