యువత చదువు అయిపోగానే ప్రభుత్వ ఉద్యోగం( Govt job ) లేదంటే ప్రైవేట్ ఉద్యోగం సాధించే పనిలో నిమగ్నం అవుతారని అందరికీ తెలిసిందే.అయితే ఉద్యోగాల పేరుతో లక్షలు కొట్టేసి దారుణంగా మోసం చేస్తున్న ఎన్నో సంఘటనలను అప్పుడప్పుడు వింటూనే ఉన్నాం.
ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ సంస్థలలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు, పెద్దపెద్ద ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాల పేరుతో చాలామంది యువతను నమ్మించి మోసం చేయడానికి అన్ని దారులను తెరచి ఉంచారు.ఈ క్రమంలోనే టీసీఎస్( TCS ) లో ఉద్యోగాల పేరుతో చేసిన అతి పెద్ద భారీ మోసం బహిర్గితం కావడంతో సంచలనంగా మారింది.

టెక్ రంగంలో దేశీయ అతి పెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్( Tata Consultancy Services ) లో పెద్ద ఎత్తున లే ఆఫ్స్ కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే కంపెనీలో పనిచేసే కొంతమంది సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు ఉద్యోగాల కోసం హెచ్ఆర్ సంస్థల నుండి భారీగా లంచాలు తీసుకున్నారు.గత మూడు సంవత్సరాల లో ఏకంగా మూడు లక్షల ఉద్యోగాల నియమకాలు జరిగాయి.ఇందులో ఎంత లేదన్న ఏకంగా రూ.100 కోట్లు సంపాదించి ఉండవచ్చని ఒక అంచనా.కంపెనీలో పనిచేసే ఓ విజిల్ బ్లోయర్ ఈ భారీ కుంభకోణాన్ని టీసీఎస్ కంపెనీ సీఈవో, సీఓఓ లకు మెయిల్ ద్వారా తెలియజేశారు.

టీసీఎస్ కంపెనీ వెంటనే చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ అజిత్ మినన్ ( Ajith Minan )ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేయాలని కోరింది.విచారణ ముగిసిన తర్వాత కంపెనీ తన రిసోర్స్ మేనేజ్మెంట్ గ్రూప్ నుంచి ఏకంగా నలుగురు అధికారులను తొలగించింది.అంతేకాకుండా టీసీఎస్ కంపెనీ మూడు రిక్రూట్మెంట్ సంస్థలపై కూడా నిషేధం విధించింది.టీసీఎస్ చరిత్రలో ఇలాంటి కుంభకోణం బయటపడడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.టీసీఎస్ కంపెనీ కొత్త సీఈవో గా కె.కృతి వాసన్ బాధితులు తీసుకున్న కొద్దిరోజుల వ్యవధిలోనే ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.







