జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ.
తొమ్మిది నెలలో ఎన్నికలు రాబోతున్నాయి ప్రతిపక్షాలన్నీ ఒకటై జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని ప్రయత్నం చేస్తున్నాయన్నారు.ప్రతి బహిరంగ సభలో వైసీపీ నాయకులను కార్యకర్తలను ఇష్టమొచ్చినట్టు తిట్టటం మొదలయిందన్నారు.
చంద్రబాబు సూట్ కేసులు ఇచ్చి కొనుక్కున్నటువంటి వ్యక్తి పవన్ కల్యాణ్ అని ఆయన మండిపడ్డారు.నాలుగు రోజుల నుండి పవన్ కల్యాణ్ వారాహి ఎక్కటం.బట్టలు ఊడదీసి కొడతాను, తోలు తీస్తాను తాట తీస్తాను అని మాట్లాడుతున్నాడని, ఇదే మాట రాజశేఖర్ రెడ్డి పై కూడా వాడాడని, బట్టలూడదీసి కొడతామని ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు వీళ్లంతా మాట్లాడారని, ప్రజలు ఎవరి బట్టలు ఊడదీసి తరిమేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని ఆయన అన్నారు.







