కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన దళపతి విజయ్ జోసెఫ్ కు( Thalapathy Vijay ) తమిళనాట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.రజనీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ కేవలం విజయ్ కు మాత్రమే ఉంది అంటే అతియసోక్తి కాదేమో.
ఈయన సినిమా వస్తుందంటే చాలు అక్కడ ఫ్యాన్స్ కు పెద్ద పండుగ అనే చెప్పాలి.యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాలకు కూడా 200 కోట్లు ఈజీగా రాబట్టగలిగే సత్తా ఈయనకు ఉంది.
మరి అలాంటి హీరో నిన్న తన పుట్టిన రోజును జరుపుకున్న విషయం తెలిసిందే.ఈయన పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయన ఫ్యాన్స్, సినీ ప్రముఖుల నుండి విషెష్ అందాయి.
దీంతో నిన్నంతా సందడిగా ఉంది.మరి ఈయనతో నటించిన పూజా హెగ్డే( Pooja Hegde ) కూడా విజయ్ కు సోషల్ మీడియా వేదికగా విషెష్ తెలిపింది.
దీంతో పాటు ఒక చిన్న వీడియోను కూడా షేర్ చేసింది.

విజయ్ దళపతి, పూజా హెగ్డే, మరో ఇద్దరు చిన్నారులు కలిసి బుట్టబొమ్మ సాంగ్ కు( Butta Bomma Song ) డాన్స్ వేయడంతో ఈ వీడియో అందరిని ఆకట్టు కుంటుంది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సూపర్ హిట్ సాంగ్ కు మరో సూపర్ స్టార్ అయిన విజయ్ డాన్స్ వేయడం ఇరు ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది.దీంతో క్షణాల్లోనే ఈ వీడియో వైరల్ అయ్యింది.
ఈ వీడియో వీరిద్దరూ కలిసి బీస్ట్ సినిమా చేస్తున్న సమయం లోనిది అని ఆమె చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉండగా విజయ్ ప్రస్తుతం లియో సినిమా చేస్తున్నాడు.లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి నిన్న ఫస్ట్ లుక్ తో పాటు ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేయగా బాగా ఆకట్టుకున్నాయి.ఇక ఈ సినిమాను అక్టోబర్ 19న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.







