అంతర్జాతీయ ఒలంపిక్ దినోత్సవం పురస్కరించుకొని ఎల్బీ స్టేడియంలో ఒలంపిక్ రన్ ను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్( Talasani Srinivas Yadav ), శ్రీనివాస్ గౌడ్, స్టీరింగ్ కమిటీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ…హెచ్ సి ఏ అవినీతి పెరిగిపోయింది.
ఉప్పల్ స్టేడియం( Uppal Stadium ) మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.
సెలక్షన్లలో అవకతవకలుజరుగుతున్నాయన్నారు.త్వరలో ఉప్పల్ స్టేడియం కి సంబంధించిన లీజ్ ముగిసిపోతుందని తెలిపారు.
ఉప్పల్ స్టేడియం లిజ్ పై ప్రభుత్వం పునరాలోచిస్తుందన్నారు.ఉప్పల్ స్టేడియాన్ని స్పోర్ట్స్ ఆథారిటీ కి హ్యాండ్ ఓవర్ చేస్తామని ప్రకటించారు.
హైదరాబాద్, ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఒలంపిక్ రన్ లో 15000 మంది విద్యార్థులు క్రీడాకారులు,పాల్గొన్నారని స్టీరింగ్ కమిటీ సభ్యులు రావుల చంద్రశేఖర్ తెలిపారు.క్రీడా స్ఫూర్తిని చాటేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించా మన్నారు.
క్రీడా సంస్కృతి వెలివేరిచేందుకు క్రీడకారులు ఒలంపిక్ కు తయారు కావాలన్న సీఎం కేసీఆర్ ఉద్దేశమని రావుల తెలిపారు.