శ్రీవాణి ట్రస్ట్ నిధుల శ్వేతపత్రంపై టీడీపీ కౌంటర్ ఇచ్చింది.ఈ క్రమంలో ట్రస్ట్ నిధులను తాడేపల్లికి తరలిస్తున్నారంటూ టీడీపీ నేత బోండా ఉమ ఆరోపించారు.
వైసీపీ వచ్చాక టీటీడీ పవిత్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు.టీటీడీని ఆదాయ వనరుగా మార్చారన్న బోండా ఉమ శ్రీవాణి ట్రస్టుకు వచ్చే నిధులపై అనుమానాలు ఉన్నాయని చెప్పారు.శ్రీవాణి పేరుతో సగం డబ్బులు కొట్టేశారా అన్న బోండా ఉమ తాడేపల్లికి రూ.700 కోట్లు తరలించారా అని ప్రశ్నించారు.శ్రీవాణి ట్రస్తు నిధులపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.శ్రీవాణి ట్రస్టుపై విమర్శలు చేస్తే కేసులు పెడతారా అని నిలదీశారు.ఈ నేపథ్యంలో ట్రస్ట్ కు విరాళాలు ఇచ్చే వారి పేర్లు వెబ్ సైట్ లో పెట్టాలని వెల్లడించారు.







