ప్రపంచంలో ఉండే ఆ దేశాలలో విమానాశ్రయాలు లేవు.. ఆ దేశాలు ఏవి అంటే..?

ప్రపంచం ఎంత అడ్వాన్సుడ్ గా అభివృద్ధి చెందుతుందో అందరికీ తెలిసిందే.గతంలో ప్రయాణాల కోసం ఎడ్ల బండ్లు, ఆ తర్వాత గుర్రపు బగ్గి, ఆ తర్వాత బస్సు, రైలు, చివరికి ప్రయాణాలను సులభతరం చేసేందుకు విమానాలు( Aeroplanes ) వచ్చేసాయి.

 These Are The Countries With No Airports Vatican City Monaco Andorra Details, C-TeluguStop.com

ఒక దేశం నుండి మరొక దేశానికి ప్రయాణించాలంటే ఎక్కువగా ఉపయోగించే రవాణా వ్యవస్థ విమానాలే.ఈ విమానాలతోపాటు కాస్త తక్కువ స్థాయిలో ఓడల ద్వారా కూడా ప్రయాణాలు జరుగుతున్నాయి.

ఇక మనిషి వ్యక్తిగతంగా ప్రయాణించాలంటే సైకిల్, కారు, బైక్, హెలికాప్టర్ లు అందుబాటులోకి వచ్చాయి.

మరి ప్రపంచ అభివృద్ధిలో ఇన్ని మార్పులు జరిగాయి కదా అయినా కూడా కొన్ని దేశాలలో విమానాశ్రయాలు లేవు అంటే నమ్మడం కాస్త కష్టమే.

ఎందుకంటే ప్రస్తుతం ధనవంతులే కాదు సామాన్య ప్రజలు కూడా సులభంగా విమాన ప్రయాణాలు చేయడం అందుబాటులోకి వచ్చింది.విమానాశ్రయాలు లేని ఆ దేశాలు యూరప్ లోనే ఉన్నాయి.

ఆ దేశాలు ఏమిటో.అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.

వాటికన్ సిటీ:

ప్రపంచంలోనే అత్యంత చిన్న దేశంగా దీనికి పేరు ఉంది.1000లోపు జనాభా ఉండే ఈ వాటికన్ సిటీకి( Vatican City ) ఎయిర్పోర్ట్ అనేదే లేదు.ఈ వాటికన్ సిటీ నలుదిక్కుల ఇటలీ దేశం వ్యాపించి ఉంటుంది.వాటికన్ సిటీకి వెళ్లాలంటే 20 కిలోమీటర్ల దూరంలో ఉండే రోమ్ లో ఉన్న సియాంపినో లేదా ఫిమిసినో ఎయిర్పోర్ట్ కు వెళ్లాల్సి ఉంటుంది.

అండోర్రా :

ఈ దేశం ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల మధ్య ఉండే అత్యంత చిన్న దేశం.కొండలు, లోయలు, ప్రకృతి అందాలతో పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి పొందింది.1982లో ఇక్కడ ఎయిర్ ఫీల్డ్ ఏర్పాటు అయినా కూడా 1984 నుండి కమర్షియల్ విమానాలకు అనుమతి నిరాకరించారు.కేవలం 2008 వరకు ప్రైవేట్ విమానాలకు మాత్రమే అనుమతి ఉండేది.

ఆ తర్వాత ఈ ఎయిర్ ఫీల్డ్ మూతపడింది.ఆ తరువాత 2010లో రీఓపెన్ చేసి 2015 నుంచి టూరిస్ట్ చార్టెడ్ ఫ్లైట్స్ మాత్రమే అనుమతిస్తున్నారు.

ఇక అండోర్రా కు( Andorra ) వెళ్లాలంటే స్పెయిన్ లేదా ఫ్రాన్స్ లో ఉండే ఎయిర్పోర్టులో దిగి రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలి.

శాన్ మారినో:

ఇటలీకి ఉత్తరం వైపు ఉన్న ఈ దేశంలో దాదాపుగా 40 వేల మంది ప్రజలు ఉంటారు.కానీ ఈ దేశంలో ఎయిర్పోర్ట్ అనేదే లేదు.ఇటలీలోని రిమిని లేదా బొలోగ్నా నగరాలలో ఉండే ఎయిర్పోర్ట్ లలో దిగి రోడ్డు మార్గం ద్వారా ఈ దేశానికి వెళ్లాల్సి ఉంటుంది.

మొనాకో:

యూరప్ లో అతి చిన్న దేశంగా ఉన్న మొనాకోలో కూడా దాదాపుగా 40 వేల మంది జనాభా ఉంటారు.ఈ దేశానికి వెళ్లాలంటే ఫ్రాన్స్ లోని నైస్ కోట్ డిఅజుర్ ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు మార్గం ద్వారా వెళ్లాల్సి ఉంటుంది.

లిచెన్ స్టైన్:

ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ దేశాల మధ్య ఉండే అతి చిన్న దేశం ఇది.పర్యాటక ప్రాంతంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ దేశంలో కూడా ఎయిర్పోర్ట్ లేదు.ఈ దేశానికి వెళ్లాలంటే ఆస్ట్రియా లేదా స్విట్జర్లాండ్ లలో ఉండే ఎయిర్ పోర్టులను ఆశ్రయించాల్సి ఉంటుంది.

Countries without an Airport

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube