ఇటీవలే సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపే యువతి యువకులకు పరిచయాలు పెరగడం మామూలే.అయితే పరిచయం అవుతున్న వారిలో మంచివారు ఎవరో.
చెడ్డవారు ఎవరో అసలు సమయం వచ్చినప్పుడే బయటపడుతుంది.ఈ క్రమంలోనే ఓ యువతికి ఫేస్ బుక్( Facebook ) ద్వారా ఒక యువకుడు పరిచయం అయ్యాడు.
పరిచయం కాస్త ముదిరి ఇద్దరి మధ్య సన్నిహిత్యం పెరిగింది.తర్వాత ఆ యువకుడి కోరిక మేరకు యువతి నగ్నంగా వీడియో కాల్( Nude Video Call ) చేసింది.
అయితే ఆ యువకుడు ఆ వీడియో కాల్ రికార్డ్ చేసి పొందుపరచుకున్నాడు.
కొంతకాలానికి ఆ యువతికి వివాహం ( Marriage ) కుదిరింది.
ఇక ఆ వీడియోలను ఆ యువకుడు పెళ్లి కొడుకుకు పంపించగా వివాహం క్యాన్సల్ అయింది.దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి పలువురిపై కేసులు నమోదు చేశారు.
అసలు వివరాలు ఏమిటో చూద్దాం.గుడివాడ పట్టణంలోని బంటుమిల్లి రోడ్డు ప్రాంతానికి చెందిన యువతి కి ఫేస్ బుక్ ద్వారా కర్రా న్యూటన్ బాబు పరిచయమయ్యాడు.
ఈ న్యూటన్ బాబు కోరిక మేరకు ఆ యువతి నగ్నంగా వీడియో కాల్ చేసింది.ఆ సమయంలో దానిని న్యూటన్ బాబు( Newton Babu ) రికార్డు చేశాడు.

కొంత కాలానికి ఆ యువతికి ఏలూరు జిల్లా మండవల్లికి చెందిన గుర్రం పరంజ్యోతితో పెళ్లి కుదిరింది.పరంజ్యోతి కాబోయే భర్త కావడంతో ఆ యువతి ఇతనికి శారీరకంగా దగ్గరైంది.అయితే న్యూటన్ బాబు ఆ యువతి మాట్లాడిన నగ్న వీడియోను పెళ్ళికొడుకు అయిన పరంజ్యోతికి పంపాడు.పరంజ్యోతి ఆ వీడియోను పెళ్లి కుదిరిచిన పెద్దలకు పంపి పెళ్లి క్యాన్సల్ చేసుకుంటున్నానని తెలిపాడు.
ఇక పెళ్లి పెద్ద అయినా గుర్రం పరంజ్యోతితో ఆ వీడియోను యువతి కుటుంబ సభ్యులకు పంపించి వివాహం కుదరదని తేల్చి చెప్పేశాడు.

మరొకవైపు న్యూటన్ బాబు బంధువులు అయినా కొండ్రు రణధీర్, బాపట్ల కోటేశ్వరరావు కూడా ఆ నగ్న వీడియోను మరికొంతమందికి పంపించారు.యువతి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.యువతిని బెదిరించి నగ్న వీడియో చిత్రీకరించిన న్యూటన్ బాబుపై అత్యాచార యత్నం కేసు నమోదు చేశారు.
పెళ్లి కుమారుడైన పరంజ్యోతి పై అత్యాచారం కేసు, జాషువాజ్యోతి, కోటేశ్వరరావు ,రణధీర్లపై 109, 120 (బి) ఐటి చట్టం కింద కేసు నమోదు చేశారు.ఎవరైనా నగ్న వీడియోలను ఇతరులకు పంపితే కఠిన శిక్షలు తప్పవని పోలీసులు తెలిపారు.







