'గేమ్ చేంజర్' రిలీజ్.. ఇప్పట్లో లేనట్టే.. అన్నాళ్ళు ఆగాల్సిందేనా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) కు ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా పేరు ఉంది.ఆర్ఆర్ఆర్ ఇచ్చిన ఫేమ్ ను మరింత పెంచుకునేలా చరణ్ తన లైనప్ ను సెట్ చేసుకుంటున్నాడు.

 Ram Charan Game Changer Movie Update, Director Shankar, Ram Charan, Rc15, Gam-TeluguStop.com

ప్రజెంట్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ‘‘గేమ్ ఛేంజర్ ( Game changer ) ఒకటి.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి.

ఆర్ఆర్ఆర్ రిలీజ్ కాకముందే ఈ సినిమా షూట్ స్టార్ట్ అయ్యింది.

ఇప్పటికే 80 శాతం పూర్తి చేసుకున్న ఈ మూవీ కొద్దిగా బ్రేక్ ఇచ్చారు.రామ్ చరణ్ కు కూతురు పుట్టడంతో ఈ సినిమాకు కొద్దిగా బ్రేక్ వేయక తప్పలేదు.మళ్ళీ ఈ సినిమా షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు కానీ ఈ సినిమా రిలీజ్ విషయంలో తాజాగా ఒక అప్డేట్ బయటకు వచ్చింది.

రిలీజ్ విషయంలో ముందు నుండి సస్పెన్స్ నడుస్తూనే ఉంది.ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా వచ్చే ఏడాది మళ్ళీ ఈ సమయానికి షిఫ్ట్ అయినట్టు తెలుస్తుంది.

అంటే మళ్ళీ వచ్చే ఏడాది జూన్ కానీ జులై లో కానీ ఈ సినిమా రిలీజ్ ఉండవచ్చట.అంటే ఎలా లేదన్న ఇంకా ఏడాది ఆగాల్సిందే.ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్ లో నిరాశ తప్పదు.ఈ ఏడాది డిసెంబర్ లో కానీ లేదంటే వచ్చే ఏడాది సంక్రాంతికి కానీ రిలీజ్ అవుతుంది అనుకుంటే ఇంకా ఇంకా ముందుకు జరుగుతూ పోతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమా కియారా అద్వానీ ( Kiara Advani )హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే తమన్ ( Taman ) సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో ట్రిపుల్ ఆర్ విజయాన్ని కంటిన్యూ చేస్తాడో లేదో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube