తన వారాహి యాత్ర( Varahi Yatra )తో తన రాజకీయ కార్యాచరణ పై స్పష్టత పెంచాల్సిన పవన ఆ స్థానంలో గందరగోళాన్ని పెంచారా? అంటే అవుననే సమాధానం వస్తుంది.వారాహి యాత్ర ముందు వరకూ పొత్తులు అనివార్యమని, జగన్ ని గద్దె దింపాలంటే పొత్తులు తోనే ముందుకు వెళ్లాలని జనసేనకులను సిద్ధం చేస్తున్న పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో మాత్రం తానే ముఖ్యమంత్రి అభ్యర్ది అని , తనకొక అవకాశం ఇవ్వాలంటూ కోరుతున్నారు.
మరోపక్క తెలుగుదేశం అనుకూల మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన పవన్ తన అభిమానుల కోరిక మేరకే సీఎం పదవిపై అలా ప్రకటన చేశానని చెప్పి కొత్త అనుమానాలు రేకెత్తించారు.అయితే టిడిపి అనుకూల మీడియా వ్యూహాత్మకంగానే పవన్ ఇంటర్వ్యూ చేసి ఈ రకంగా వ్యాఖ్యలు చేయించిందని వాదనలు లేకపోలేదు.

మరొక పక్క వెనకబడిన వర్గాలకు రాజ్యాధికారం అంటూ పవన్ కళ్యాణ్ ఇస్తున్న పిలుపుని ఎంతవరకు నమ్మాలో తెలియని సందిగ్ధంలో ఆయా వర్గాలు ఉన్నాయని విశ్లేషణలు వస్తున్నాయి కేవలం జగన్( YS Jagan Mohan Reddy ) ఓడించడానికి ఆయన పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు వస్తున్నాయి.ముఖ్యమంత్రి పదవి తనకు దక్కడం కష్టం అన్న వాతావరణాన్ని క్రియేట్ అయితే జనసేన కు వచ్చే ఎన్నికలలో సరైన పలితాలు రావనే భయంతోనే ఆయన సీఎం పదవిపై ప్రకటనలు చేస్తున్నారే తప్ప ఆయనకు నిజంగా ఆ పదవికి సిన్సియర్గా ప్రయత్నించడం లేదన్న అధికార పార్టీ విశ్లేషకులు మాటలను చాలామంది నమ్ముతున్నట్టుగా కనిపిస్తుంది.

తన వారాహి యాత్ర మధ్యలోనే ఉంది కాబట్టి తర్వాతి రోజుల్లో అయినా ఆయన ఈ దిశగా స్పష్టమైన ప్రకటన చేస్తే ఈ గందరగోళానికి తెరపడే అవకాశం ఉంది .అయితే తాను టార్గెట్ చేసిన వర్గాలను మాత్రం ఆయన బాగానే ఆకట్టుకున్నట్లుగా కనపడుతుంది.ముఖ్యంగా యువత ఆయన సభలకు విపరీతం గా ఆకర్షితమవుతుంది .ఆయన బహిరంగ యాత్రలకు వస్తున్న స్పందన చూస్తుంటే జనసేన పట్ల జన సైనికులతో పాటు సాధారణ ప్రజానీకం లో కూడా ఆసక్తి కనిపించింది ఆయన వెళ్లిన ప్రతి చోటా ప్రజలు స్వతంత్రంగానే ఆయా సభలకు హాజరు అవ్వటం కనిపిస్తుంది
.






