తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అమరుల సంస్మరణ!

అమరుల త్యాగాల వల్లే నేటి తెలంగానా దశాబ్ది ఉత్సవాలు( Telangana State Decade Celebrations )!ఈ రోజు అమరులకు అంకితం చేసిన దినం!రాజన్న సిరిసిల్ల జిల్లా : తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు పునాదులు నా వెనుక ఉన్నటువంటి ఈ అమర వీరుల స్థూపం అంటే ఈ ఆమరుల త్యాగం లేనిదే తెలంగాణ ఉండేది కాదు మరి తెలంగాణ లేని దశాబ్ద ఉత్సవాల అవసరం కూడా ఉండేది కాదు అంటే అంత గొప్ప త్యాగం చేసి ఈ త్యాగాలు అన్నిటిని కూడా ప్రో.

 Commemoration Of Martyrs As Part Of Telangana State Decade Celebrations , Telang-TeluguStop.com

జయశంకర్( Jayashankar ) చాలామంది మరి తెలంగాణ ఉద్యమ నేతలు కేసీఆర్ నాయకత్వంలో పోరాటం నడిపి మన రాష్ట్రాన్ని సాధించుకొన్నామని అన్నారు.ఈ రాష్ట్రం ఒక 60 సంవత్సరాల పోరాటం తర్వాత మనకు వచ్చింది ఎప్పుడైతే నిజాం నియంత పాలన పోయిందో 1948లో సెప్టెంబర్ 17 నాడు ఆ తర్వాత మనం స్వేచ్ఛగా హైదరాబాద్ సంస్థానంగా ఉంటుందని అనుకున్నాం.

కానీ కేంద్ర ప్రభుత్వం వారు మన అప్పటి తెలంగాణను మద్రాసు నుంచి బయటకు వచ్చినటువంటి ఆంధ్రతో విలీనం చేసిందన్నారు.మనం 60 సంవత్సరాల పాటు అక్కడున్నటువంటి ఆంధ్ర వలస పాలన కింద నలిగిపోయినటువంటి విషయం ప్రజలందరూ గ్రామ గ్రామాన వేములవాడలో ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇంటిముందటకు వచ్చి సకల జనుల సమ్మెలో వంట వార్పు చేసామని నిరాహార దీక్షలు చేసామని అందరికంటే గొప్ప త్యాగాలు చేసిన వాళ్ళని ఇవాళ ప్రాణాలు అర్పించిన వాళ్లకు మనం నివాళులర్పించుకుంటున్నానిఅన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఎన్నో పోరాటల గడ్డమీద వెలసినటువంటి రాష్ట్రం మీకు తెలవాలి.రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల కోట్ల బడ్జెట్లో అన్ని రకాల అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంలో మీరందరూ కూడా అభివృద్ధి చెందుతూ మీ అందరి కూడా స్వేచ్ఛగా ముందుకు పోయేటువంటి పరిస్థితి వచ్చిందంటే అది అమరుల త్యాగ ఫలం నాటి ఉద్యమ నేత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చేసిన పోరాటం మాత్రమే అని అన్నారు.ఒకప్పుడు ఎండాకాలం లో త్రాగుదామంటే మంచినీళ్లు దొరకని పరిస్థితు ఉండే కానీ ఇప్పుడు వేములవాడ పట్టణంలో తొమ్మిది వేల కుటుంబాలకు మనం మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు ఇచ్చుకుంటున్నామని అలాగే గుడి చెరువును మిషన్ కాకతీయ ద్వారా పూర్తిగా పూడికలు చేసి మధ్య మానేరు జలాశయం నుంచి లిఫ్ట్ పెట్టి గత నాలుగు సంవత్సరాలుగా గుడి చెరువు ఎండిపోతలేదు అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత 600 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క అబ్బాయి అమ్మాయి మీద 1లక్ష 15 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం దేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అన్నారు.2014లో తెలంగాణ రాకముందు తెలంగాణలో సగటు ఆదాయము 1,17,000 ఉంటే ఇవాళ 3లక్షల 17వేల రూపాయలకు పెరిగింది అంటే నిజంగా కూడా అది తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి అని జరిగిందా లేదా అన్న విషయాన్ని విద్యార్థులు కూడా గూగుల్లో చూడాలి మీరు కూడా తప్పకుండా తెలుసుకోవాలని పిల్లలు ఎందుకంటే మీరే భవిష్యత్తు తెలంగాణలో ఇంకా గొప్పగా తీర్చిదిద్దేది మీరే కాబట్టి మీ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి,  కమిషనర్ అన్వేశ్, పార్టీ అధ్యక్షులు పుల్కం రాజు, గోస్కుల రవి, మల్యాల దేవయ్య, కౌన్సిలర్లు మారం కుమార్, జడల లక్ష్మి, జోగిని శంకర్, సిరిగిరి రామచందర్, యాచమనేని శ్రీనివాసరావు, నరాల శేఖర్,  ఇప్పపూల అజయ్, బింగి మహేష్ గోలి మహేష్, కో ఆప్షన్ సభ్యులు బాబున్, నాయకులు పొలస నరేందర్, రామతీర్థపు రాజు , గడ్డం  హనుమాన్లు, సుధాకర్ రావు, గూడూరి మధు, భాస్కర్ రావు, వెంగల శ్రీకాంత్, నరాల దేవేందర్, వాసాల శ్రీనివాస్, నీరటి మల్లేశం, కొండ కనకయ్య, సలీం, ఆరే సత్యనారాయణ, పెంట బాబు, దమ్మ భాస్కర్, టైలర్ శ్రీనివాస్, కృష్ణ మూర్తి, పీర్ మహమ్మద్ తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube