పవన్ కళ్యాణ్ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మిస్ అయినా సినిమా అదేనా..? చేసి ఉంటే ఇండస్ట్రీ హిట్ అయ్యేది!

అభిమానులకు కొన్ని డ్రీం కాంబినేషన్స్ ఉంటాయి, ఒక్కసారైనా వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక్క సినిమా పడితే బాగుండును అని అనుకుంటూ ఉంటాము.ఆ తర్వాత కొన్ని రోజులకు మనకి ఇష్టమైన ఆ కాంబినేషన్ లోనే సినిమా మిస్ అయ్యింది అంటూ ఎవరో ఒకరి ద్వారా తెలుసుకొని చాలా బాదపడిపోతూ ఉంటాము.

 Pawan Kalyan - Boyapati Srinu Combination Is Missing But The Movie Is The Same I-TeluguStop.com

అలాంటి కాంబినేషన్స్ లో ఒకటే పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )మరియు బోయపాటి శ్రీను( Boyapati Srinu ) కాంబినేషన్.పవన్ కళ్యాణ్ ని అప్పట్లో అభిమానులు ఒక పర్ఫెక్ట్ ఊర మాస్ సినిమా లో చూడాలని అందరూ అనుకుంటూ ఉన్నారు.

సరిగ్గా ఆ సమయం లోనే ‘గబ్బర్ సింగ్’ ( Gabbar Singh )అనే బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం వచ్చింది.అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటినీ ఈ చిత్రం బద్దలు కొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది.

ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ వెంటనే డీవీవీ దానయ్య ఎంటర్టైన్మెంట్స్( DVV Danayya Entertainments ) సినిమాలో ఒక సినిమా చేసేందుకు అడ్వాన్స్ తీసుకున్నాడు.

Telugu Boyapati Srinu, Cameragangatho, Pawan Kalyan, Pawankalyan, Puri Jagannath

డైరెక్టర్ కోసం వెతుకుతున్న సమయం లో బోయపాటి శ్రీను వద్ద ఒక మంచి స్క్రిప్ట్ ఉందని తెలిసింది.డీవీవీ దానయ్య ఎంటర్టైన్మెంట్స్ సంస్థ బోయపాటి శ్రీను ని పిలిపించి ఆ కథని పవన్ కళ్యాణ్ తో చేయించడానికి సన్నాహాలు చేసారు.పవన్ కళ్యాణ్ ని కలిసి కథ వినిపించాడు, కానీ ఎందుకో పవన్ కళ్యాణ్ కి ఆ సినిమా తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా లేదని, కొన్ని మార్పులు చేర్పులు చేసి తీసుకొని రమ్మన్నాడట.

బోయపాటి శ్రీను కూడా అలాగే అని చెప్పి, పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ కి వినిపించాడు.అయినా కూడా ఎందుకో పవన్ కళ్యాణ్ ఆ ఓవర్ మాస్ దోసేజి షాట్స్ మైండ్ లోకి ఎక్కడం లేదు, స్టోరీ విన్నాడు, నిర్ణయం తర్వాత చెప్తా అన్నాడు కానీ ఏ నిర్ణయం కూడా చెప్పలేదు.

Telugu Boyapati Srinu, Cameragangatho, Pawan Kalyan, Pawankalyan, Puri Jagannath

సరిగ్గా ఆ సమయం లోనే పూరి జగన్నాథ్( Puri Jagannath ) పవన్ కళ్యాణ్ తో సొసైటీ కి సంబంధించిన ‘కెమెరా మ్యాన్ గంగతో రాంబాబు’ స్టోరీ తో పవన్ ముందుకొచ్చాడు.ఈ కథ ఆయనకీ వినిపించగానే వెంటనే ఓకే చెప్పేసి సెట్స్ మీదకి వెళ్లారు.సెట్స్ మీదకి వెళ్లే ముందు పవన్ కళ్యాణ్ బోయపాటి శ్రీను కి ఫోన్ చేసి, మీరు నాకు చెప్పిన స్క్రిప్ట్ నాకు చాలా నచ్చింది కానీ, ఎందుకో నాకు సెట్ అవ్వదు అనిపిస్తుంది.ఈ కథ బాలయ్య బాబు గారికి అయితే సరిగ్గా సరిపోతుంది అని చెప్పి , నాకు తగ్గ స్క్రిప్ట్ ని డెవలప్ చెయ్యండి, మీ దర్శకత్వం లో చెయ్యాలని నాకు కూడా ఉంది అని చెప్పాడట.

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తన ప్రాజెక్ట్స్ తో బిజీ అవ్వడం, బోయపాటి శ్రీను తన సినిమాలతో బిజీ అవ్వడం అలా ఈ కాంబినేషన్ ఇప్పటి వరకు సెట్ కాలేకపోయింది, రాబోయే రోజుల్లో అయినా ఈ కాంబినేషన్ లో ఒక సినిమాని చూస్తామో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube