కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్( Vijay Joseph ) కు ఉన్న క్రేజ్ ఏ లెవల్ లో ఉంటుందో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.ఈయన ఈ మధ్య ఏ సినిమా చేసిన హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండానే 200 కోట్ల కలెక్షన్స్ రాబడుతున్నాయి.
మరి ఈ ఏడాది అప్పుడే వారిసు సినిమాతో పలకరించిన విజయ్ ఇప్పుడు మరో సినిమా రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు.
కొత్త సినిమాను స్టార్ట్ చేయడమే కాకుండా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు.
ప్రస్తుతం విజయ్ నటిస్తున్న మోస్ట్ ఏవైటెడ్ సినిమా ‘లియో’( Leo ).లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రజెంట్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది.భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా తమిళ్ ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్ట్ లలో ఒకటి.
ఈ రోజు విజయ్ బర్త్ డే కానుకగా ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే రిలీజ్ చేయగా ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేయనున్నారు.ఈ క్రమంలోనే ఈ మొదటి పాటపై అంచనాలు భారీగా ఉన్నాయి.ఇక తాజాగా ఈ సినిమా థియేట్రికల్ భారీ హైప్ ఉండగా ఓటిటిలో( OTT ) కూడా రిలీజ్ చేసేందుకు భారీ ప్లాన్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఓటిటి వర్షన్ నెక్స్ట్ లెవల్లో ప్లాన్ చేస్తున్నారట.
విజయ్ లియో సినిమాను ఓటిటి వర్షన్ లో అనేక విదేశీ భాషల్లో అందుబాటులో ఉండేలా చూస్తారని తెలుస్తుంది.చూడాలి ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎన్ని అంచనాలు క్రియేట్ చేస్తుందో.సెవన్ స్క్రీన్ స్టూడియో( Seven Screen Studio ) పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుందిగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాను అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.