మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన క్యాబ్ డ్రైవర్.. మహిళ చేసిన పనికి నెటిజెన్స్ ఫిదా..!

బెంగుళూరు( Bangalore ) నగరంలో ఓ మహిళా ప్రయాణికురాలు క్యాబ్ బుక్ చేసుకుని ఒంటరిగా ప్రయాణించింది.కారులో ఆ మహిళ ఒక్కరే ప్రయాణిస్తూ ఉండడంతో సమయం చూసుకొని ఆ క్యాబ్ డ్రైవర్( Cab Driver ) చాలా అసభ్యంగా ప్రవర్తించాడు.

 Cab Driver Misbehaves With Woman Passanger In Bangalore Details, Cab Driver. Cab-TeluguStop.com

దీంతో ఆ మహిళా ప్రయాణికురాలు చేసిన పనికి నెటిజెన్స్ ఫిదా అయ్యారు.అసలు జరిగిందేమిటో చూద్దాం.

బెంగుళూరు నగరంలో ఓ మహిళ బీఎటీఎం రెండో స్టేజి నుండి జెపి నగర్ మెట్రో స్టేషన్ వరకు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది.అయితే క్యాబ్లో ఆ మహిళ ఒంటరిగా ప్రయాణించింది.

క్యాబ్ డ్రైవర్ కాసేపటికి వేరే రూట్ లో వెళ్లడం ఆమె గమనించింది.డ్రైవర్ ను చూస్తే ఏదో అనుమానం కలగడంతో వెంటనే ఆమె ఉబర్ యాప్ లో( Uber App ) ఫిర్యాదు చేసింది.

దీంతో డ్రైవర్ వెంటనే మళ్ళీ నిర్దేశిత రూట్లో కారును తీసుకువెళ్లాడు.

ఆ మహిళ రిస్క్ చేసి ప్రయాణించడం ఎందుకని భావించి గమ్యస్థానం రాకముందే కారు నుంచి దిగాలని నిర్ణయించుకుంది.

తర్వాత వెంటనే కారును ఆపి ఆ క్యాబ్ డ్రైవర్ కు డబ్బులు చెల్లించింది.డబ్బులు తీసుకున్న తర్వాత ఆ క్యాబ్ డ్రైవర్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు.

ఆమె ప్రైవేట్ భాగాలపై చేతులు వేయడంతో వెంటనే ఆమె ప్రతిఘటించింది.దీంతో ఆ క్యాబ్ డ్రైవర్ ఆ మహిళపై చేయి చేసుకున్నాడు.

ఆ మహిళ ఆలస్యం చేయకుండా వెంటనే జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతానికి పరిగెత్తింది.

Telugu Bangalore, Cab Cab, Uber Cab, Passanger-Latest News - Telugu

తరువాత ఆ మహిళ తనకు ఎదురైన అనుభవాన్ని వెంటనే లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేసింది.అంతేకాదు ఆ కారులో తన వస్తువులను కూడా మరచిపోయానని పేర్కొనింది.క్షణాల్లో ఈ పోస్ట్ వైరల్ అయింది.

వెంటనే ఊబర్ స్పందించి క్యాబ్ డ్రైవర్ పై చర్యలు చేపట్టింది.తాను పోస్ట్ పెట్టిన వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నందుకు ఉబర్ కు ఆ మహిళ ధన్యవాదాలు తెలిపింది.

Telugu Bangalore, Cab Cab, Uber Cab, Passanger-Latest News - Telugu

ఈ విషయంపై ఉబర్ మాట్లాడుతూ.ఇలాంటి ఘటనలు జరగడం కొత్తేమీ కాదని, ఒంటరిగా ప్రయాణించే మహిళలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఉబర్ సూచించింది.ట్రిప్ ను ఇతరులతో పంచుకోవడం, తమ యాప్ లో ఉండే రైడ్ చెక్ 3.0 లాంటి ఫీచర్లను ఉపయోగించుకోవడం, ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తమ కస్టమర్ కేర్ కు ఫోన్ చేయడం, లేదంటే పోలీసులకు ఫోన్ చేయడం లాంటివి చేయాలని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube