మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన క్యాబ్ డ్రైవర్.. మహిళ చేసిన పనికి నెటిజెన్స్ ఫిదా..!

బెంగుళూరు( Bangalore ) నగరంలో ఓ మహిళా ప్రయాణికురాలు క్యాబ్ బుక్ చేసుకుని ఒంటరిగా ప్రయాణించింది.

కారులో ఆ మహిళ ఒక్కరే ప్రయాణిస్తూ ఉండడంతో సమయం చూసుకొని ఆ క్యాబ్ డ్రైవర్( Cab Driver ) చాలా అసభ్యంగా ప్రవర్తించాడు.

దీంతో ఆ మహిళా ప్రయాణికురాలు చేసిన పనికి నెటిజెన్స్ ఫిదా అయ్యారు.అసలు జరిగిందేమిటో చూద్దాం.

బెంగుళూరు నగరంలో ఓ మహిళ బీఎటీఎం రెండో స్టేజి నుండి జెపి నగర్ మెట్రో స్టేషన్ వరకు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది.

అయితే క్యాబ్లో ఆ మహిళ ఒంటరిగా ప్రయాణించింది.క్యాబ్ డ్రైవర్ కాసేపటికి వేరే రూట్ లో వెళ్లడం ఆమె గమనించింది.

డ్రైవర్ ను చూస్తే ఏదో అనుమానం కలగడంతో వెంటనే ఆమె ఉబర్ యాప్ లో( Uber App ) ఫిర్యాదు చేసింది.

దీంతో డ్రైవర్ వెంటనే మళ్ళీ నిర్దేశిత రూట్లో కారును తీసుకువెళ్లాడు.ఆ మహిళ రిస్క్ చేసి ప్రయాణించడం ఎందుకని భావించి గమ్యస్థానం రాకముందే కారు నుంచి దిగాలని నిర్ణయించుకుంది.

తర్వాత వెంటనే కారును ఆపి ఆ క్యాబ్ డ్రైవర్ కు డబ్బులు చెల్లించింది.

డబ్బులు తీసుకున్న తర్వాత ఆ క్యాబ్ డ్రైవర్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు.

ఆమె ప్రైవేట్ భాగాలపై చేతులు వేయడంతో వెంటనే ఆమె ప్రతిఘటించింది.దీంతో ఆ క్యాబ్ డ్రైవర్ ఆ మహిళపై చేయి చేసుకున్నాడు.

ఆ మహిళ ఆలస్యం చేయకుండా వెంటనే జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతానికి పరిగెత్తింది.

"""/" / తరువాత ఆ మహిళ తనకు ఎదురైన అనుభవాన్ని వెంటనే లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేసింది.

అంతేకాదు ఆ కారులో తన వస్తువులను కూడా మరచిపోయానని పేర్కొనింది.క్షణాల్లో ఈ పోస్ట్ వైరల్ అయింది.

వెంటనే ఊబర్ స్పందించి క్యాబ్ డ్రైవర్ పై చర్యలు చేపట్టింది.తాను పోస్ట్ పెట్టిన వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నందుకు ఉబర్ కు ఆ మహిళ ధన్యవాదాలు తెలిపింది.

"""/" / ఈ విషయంపై ఉబర్ మాట్లాడుతూ.ఇలాంటి ఘటనలు జరగడం కొత్తేమీ కాదని, ఒంటరిగా ప్రయాణించే మహిళలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఉబర్ సూచించింది.

ట్రిప్ ను ఇతరులతో పంచుకోవడం, తమ యాప్ లో ఉండే రైడ్ చెక్ 3.

0 లాంటి ఫీచర్లను ఉపయోగించుకోవడం, ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తమ కస్టమర్ కేర్ కు ఫోన్ చేయడం, లేదంటే పోలీసులకు ఫోన్ చేయడం లాంటివి చేయాలని తెలిపింది.

హైవే మీద పిచ్చిగా గెంతులు వేసిన యువతి.. చివరికి ఏమైందో చూస్తే..?