సభ కు నమస్కారం !  భారీగా ప్లాన్ చేస్తున్న బిజెపి ? 

తెలంగాణలో బిజెపిని మరింత బలోపేతం చేసి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఆ పార్టీ ఉంది.దీనిలో భాగంగానే భారీగా తెలంగాణ అంతట సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది.

 Bjp Is Planning Meetings 119 Assembly Constituencies In Teletelangana Bandi Sa-TeluguStop.com

వారం రోజుల్లో తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లోనూ బిజెపి సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు.ఈ మేరకు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ( Bandi Sanjay Kumar )మంచిర్యాల నియోజకవర్గంలో సభను నిర్వహించి దీన్ని ప్రారంభించారు.

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ బిజెపి బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమైంది.బీ, కాంగ్రెస్ ల దూకుడు కు కళ్లెం వేసే విధంగా బిజెపి ఈ సభలతో దూకుడు పెంచేందుకు సిద్ధమవుతోంది.

ప్రతిరోజు ఆయా నియోజకవర్గాల్లో రాష్ట్రస్థాయి నేతలు పర్యటించే విధంగా షెడ్యూల్ రూపొందిస్తున్నారు.

Telugu Bjp, Congress, Jp Nadda, Modhi, Telangana-Politics

ఈనెల 30వ తేదీ వరకు బండి సంజయ్ ఈ సభలతో బిజీగా ఉండబోతున్నారు.రోజుకో అసెంబ్లీలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు.ఈనెల 24న రామగుండం, 25న నాగర్ కర్నూల్ లో జేపీ నాడ్డా ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహించనున్నారు.26 న నల్గొండ, 27న పేట, 28న ఇబ్రహీంపట్నం 29న మక్తల్ , 30 న బోధ్ నియోజకవర్గంలో ఆయన పర్యటించనున్నారు.ఈ సభలకు తెలంగాణ బిజెపి కీలక నాయకులంతా హాజరయ్యే విధంగా ప్లాన్ చేశారు.

హుజురాబాద్ ఎమ్మెల్యే చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్(Etela Rajender ),  మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి( Komatireddy Raj Gopal Reddy ),  మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి,  జితేందర్ రెడ్డి , విజయశాంతి , వివేక్ , తదితరులు ఒక్కొక్కరు కనీసం ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించే సభల్లో పాల్గొనబోతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి .

Telugu Bjp, Congress, Jp Nadda, Modhi, Telangana-Politics

ఇప్పటికే ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా ఒక్క రోజులోనే తెలంగాణలోని 35 లక్షల కుటుంబాలను కలిసినట్టు బీజేపీ ప్రకటించింది.తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 57వ డివిజన్ ,173 పోలింగ్ బూత్ పరిధిలో మోది పథకాలను వివరించనున్నారు.అలాగే కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అంబర్ పేట్ నాంపల్లి, జూబ్లీహిల్స్, అసెంబ్లీ నియోజకవర్గల్లో , కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి , చేవెళ్ల పరిధిలోని హిమాయత్ నగర్ లో ఎంపీ లక్ష్మణ్ , గాంధీనగర్ డివిజన్ లోని స్వామి వివేకానంద బస్తీలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ఇదేవిధంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు ప్రజలకు చేరువయ్యేందుకు బిజెపి అనేక కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube