పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ప్రస్తుతం వారాహి యాత్ర( Varahi Yatra ) లో బిజీగా ఉన్నారు.అలాగే పార్టీ కార్యకర్తలు జనసేన నాయకులతో కలిసి ఈయన పలు సభలకు హాజరవుతూ అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తాజాగా ఓ సమావేశంలో పాల్గొని ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ముఖ్యంగా సినిమా టికెట్లపై రేట్లు తగ్గించడం పట్ల పవన్ కళ్యాణ్ మండి పడ్డారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం నన్ను ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నాలు చేసిందని తెలిపారు.

ఈ క్రమంలోనే ఉద్దేశపూర్వకంగానే జగన్ ప్రభుత్వం తాను నటించిన సినిమాల విడుదల సమయంలో టికెట్ల రేట్లు తగ్గిస్తూ రాత్రికి రాత్రి జీవో తీసుకువచ్చారు.ఈ విధంగా సినిమా టికెట్ల రేట్లు తగ్గించడం వల్లే తాను నటించిన భీమ్లా నాయక్( Bheemla Naik ) సినిమాకు సుమారు 30 కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చిందంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అయ్యాయి.సినిమా టికెట్లను 10 రూపాయలు పెడితే పెట్టుబడి పెట్టినది ఎప్పుడు రాబట్టాలి అంటూ ఈయన ప్రశ్నించారు.
కేవలం నాపై కక్ష సాధింపు చర్య కోసమే ఇలా చేశారని జగన్ ప్రభుత్వం పై మండిపడ్డారు.

కేవలం భీమ్లా నాయక్ సినిమా విషయంలో మాత్రమే కాదని తాను నటించిన వకీల్ సాబ్ ( Vakeel Saab ) సినిమా విషయంలో కూడా ఏపీ సర్కార్ ఇలాగే వ్యవహరించదని తెలిపారు.తాను నటించిన ఈ రెండు సినిమాలు అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి.కానీ ఏపీలో ఈ సినిమాని కొనుగోలు చేసిన బయ్యర్లకు నష్టాలు వచ్చాయని ఆ నష్టాలను తాను చెల్లించాను అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.
ఇక ఈయన నటించిన భీమ్లా నాయక్ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా, వకీల్ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు.అయితే ఈ రెండు సినిమాలు కూడా రీమేక్ సినిమాలు ( Remake Movies ) కావడం విశేషం.







