పుదీనా( Spearmint ).దీని గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.
అద్భుతమైన ఆకు కూరల్లో పుదీనా ఒకటి.అయితే చాలా మంది పుదీనాను బిర్యానీ, నాన్ వెజ్ వంటలకు మాత్రమే పరిమితం చేస్తుంటారు.
వంటలకు చక్కటి ఫ్లేవర్ ను అందించడమే కాదు ఆరోగ్యపరంగా పుదీనా అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.పుదీనాలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, విటమిన్ బి, విటమిన్ ఎ.విటమిన్ సి ఫైబర్ తో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ సైతం పుష్కలంగా ఉంటాయి.
నిజానికి ప్రతిరోజు నాలుగు పుదీనా ఆకులు( Mint Leave ) నమిలి తింటే మీరు ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి.
ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యల నుంచి బయట పడేందుకు పుదీనా ఆకులు చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తాయి.ఒత్తిడి( Stress )గా ఉన్నా డిప్రెషన్ కు లోనైనా పుదీనా ఆకులను తీసుకుని వాటర్ తో వాష్ చేసి నమిలి తినండి.
ఆపై ఒక గ్లాస్ వాటర్ తాగండి.ఇలా చేస్తే మంచి రిలీఫ్ పొందుతారు.తలనొప్పి ఉన్నా సరే క్షణాల్లో దూరం అవుతుంది.
అలాగే చాలా మంది నోటి దుర్వాసన సమస్యతో ఇబ్బంది పడుతుంటారు.ఈ సమస్యకు చెక్ పెట్టడానికి పుదీనా గ్రేట్ గా హెల్ప్ చేస్తుంది.రోజు నాలుగు పుదీనా ఆకులు నమిలి తింటే నోటి నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది.
మెటబాలిజం రేటు ను పెంచి క్యాలరీలను త్వరగా కరిగించడానికి సైతం పుదీనా ఆకులు సహాయపడతాయి.
రెగ్యులర్గా నాలుగు పుదీనా ఆకులు తింటే వెయిట్ లాస్ అవుతారు.పుదీనా ఆకుల్లో మెంతోల్ ఎసెన్స్ ఉంటుంది.ఇది గొంతు నొప్పిని తగ్గించడానికి చాలా అద్భుతంగా సహాయపడుతుంది.
అంతేకాదు రోజుకు నాలుగు పుదీనా ఆకులు తింటే మెదడు చురుగ్గా పని చేస్తుంది.పలు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.
కంటి చూపు పెరుగుతుంది.ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ అవుతుంది.
అజీర్తి, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా సైతం ఉంటాయి.