యాదాద్రి భువనగిరి జిల్లా: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని బుధవారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు.ఆయనకు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్,ఆలయ ఈఓ, అర్చకులు స్వాగతం పలికారు.
శ్రీవారి ప్రధాన ఆలయంలో స్వయంభూ దేవుడిని దర్శించుకున్న మంత్రి ప్రత్యేక పూజలు చేశారు.
వేద పండితులు మంత్రిని ఆశీర్వదించగా, ఎండోమెంట్ మెంట్ కమిషనర్ శ్రీస్వామివారి ప్రసాదాన్ని అందచేశారు.
అనంతరం యాదగిరిగుట్టలో చిరుధాన్యాల ప్రసాదం, స్వామి వారి బంగారు, వెండి నాణేల విక్రయ ఆన్లైన్ సేవలను మంత్రి ప్రారంభించారు.







