టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినా విలన్ గా పాపులర్ అయిన వాళ్లలో కబీర్ సింగ్( Kabir Singh ) ఒకరు.జిల్ సినిమాతో టాలీవుడ్ లో కెరీర్ ను మొదలుపెట్టిన ఈ విలన్ ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరీర్ పరంగా వెనక్కు తిరిగి ఛూసుకోవాల్సిన అవసరం రాలేదు.
కొన్ని సినిమాలలో సెకండ్ విలన్ రోల్స్ లో సైతం నటించి ఈ విలన్ మెప్పించారు.కోలీవుడ్( Kollywood ) ఇండస్ట్రీతో పాటు ఇతర ఇండస్ట్రీలలో కూడా ఈ విలన్ కు ఆఫర్లు వస్తున్నాయి.

ఈ ఏడాది విడుదలైన శాకుంతలం సినిమాలో అసుర రాజు పాత్రను అద్భుతంగా పోషించి కబీర్ సింగ్ మెప్పించారు.టాలీవుడ్ ఇండస్ట్రీలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకరైన కబీర్ సింగ్ త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.హర్యానాకు చెందిన యువతిని కబీర్ సింగ్ పెళ్లి చేసుకోనున్నారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి.హర్యానాలోని సూరజ్ ఖండ ఫంక్షన్ హాల్( Suraj Khanda Function Hall in Haryana ) లో ఈ విలన్ వివాహం జరగనుందని బోగట్టా.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సెలబ్రిటీలకు పెళ్లికి సంబంధించిన ఆహ్వానం అందిందని సమాచారం.మెహందీ ఫంక్షన్ తో పెళ్లి సంబరాలు మొదలుకానున్నాయని పెళ్లి జరిగిన రోజే రిసెప్షన్ ను కూడా ఏర్పాటు చేయనున్నారని సమాచారం అందుతోంది.కబీర్ పెళ్లి చేసుకోబోయే యువతి పేరు సీమా ఛాహల్ అని తెలుస్తోంది.సినిమా ఇండస్ట్రీకి ఆమెకు ఎలాంటి సంబంధం లేదని ఆమె వృత్తిరిత్యా టీచర్ గా పని చేస్తారని సమాచారం అందుతోంది.
ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మరి కొందరు సినీ ప్రముఖులు సైతం ఒక ఇంటివాళ్లు కానున్నారని సమాచారం అందుతోంది.కబీర్ సింగ్ కు కెరీర్ పరంగా కూడా కలిసిరావాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
రాబోయే రోజుల్లో కబీర్ సింగ్ వరుస విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.







