తెలంగాణ రాష్ట్రానికి మరో సంస్థ భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది.ఇందులో భాగంగా హైదరాబాద్ నగరంలో లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ ఇన్వెస్ట్ మెంట్ పెట్టనుంది.
ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో యూకేకి చెందిన టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు కానుంది.కాగా గత నెల యూకేలో సంస్థ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశమై చర్చించిన విషయం తెలిసిందే.
ఐదు వారాల్లోనే టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు లాయిడ్స్ సంస్థ ప్రకటించింది.ఈ నేపథ్యంలో లాయిడ్స్ సంస్థ నిర్ణయంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.







