Tamanna: అర్థనగ్నంగా కనిపించిన తమన్నా.. ఆ ఒక్క కారణంతోనే అవి తీసేసానంటూ బోల్డ్ కామెంట్?

సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది హీరోయిన్స్ బోల్డ్ గా నటించడానికి అస్సలు ఇబ్బంది పడరు.కొన్ని సీన్స్ లలో నగ్నంగా కూడా కనిపిస్తూ షాక్ ఇస్తూ ఉంటారు.

 Heroine Tamanna Comments About Her Bold Scenes In Jee Karda Movie-TeluguStop.com

అది కేవలం తమ వృత్తిపై ఉన్న గౌరవంతోనే వాళ్ళు వాళ్ళ నటిస్తుంటారు కానీ.నిజానికి ఇష్టంగా నటించరు.

కానీ చూసే ప్రేక్షకులు మాత్రం వీరి బోల్డ్ కంటెంట్ పై విమర్శలు చేస్తూ ఉంటారు.ఇప్పుడు తమన్నా( Tamanna ) విషయంలో కూడా అదే జరుగుతుంది.

ఇంతకు అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా తన అందంతో ప్రేక్షకులను మెప్పింస్తుంది తమన్నా.

ముట్టుకుంటే మాసిపోయే రంగుతో ఉన్న ఈ ముద్దుగుమ్మను తొలిచూపులోనే కుర్రాళ్ళు ఫిదా అయ్యారు.కేవలం అందమే కాకుండా మంచి టాలెంట్ కూడా ఉంది.

ఈ ముద్దుగుమ్మ శ్రీ అనే సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయ్యింది.ఆ తర్వాత హ్యాపీ డేస్ సినిమాతో మంచి హిట్ అందుకొని వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.

అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా నిలిచింది.కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో, అతిధి పాత్రలలో కూడా నటించింది.తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ భాషలలో కూడా నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ.

తన సినిమాలకు సంబంధించిన అప్డేట్లను కాకుండా తన ఫోటోలను కూడా బాగా పంచుకుంటుంది.

Telugu Bollywood, Tamanna, Jee Karda Web, Tamannaglamor-Movie

అప్పుడప్పుడు ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.ఇక ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంది.పైగా ఓటీటీ ప్రాజెక్టులలో కూడా సైన్ చేస్తూ దూసుకెళ్తుంది.

అయితే ఇదంతా పక్కన పెడితే తమన్నా అప్పుడప్పుడు బోల్డ్ గా కూడా కనిపిస్తూ ఉంటుంది.అయితే మరో సరి తను ఒక సినిమాలో అర్ధ నగ్నంగా కనిపించడంతో జనాలు ఆమెపై విమర్శలు చేస్తున్నారు.

Telugu Bollywood, Tamanna, Jee Karda Web, Tamannaglamor-Movie

తాజాగా ఆమె జి కర్దా( Jee Karda ) అనే సిరీస్ లో హాట్ గా కనిపించింది.పైన టాప్ తీసేసి రొమాన్స్ చేయటంతో దానికి సంబంధించిన కొన్ని క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.దీంతో తాజాగా ఆమె ఓ మీడియా ఇంటర్వ్యూలో తను నటించిన సీన్ గురించి స్పందించింది.అందరూ ఈ సిరీస్ లో బోల్డ్ కంటెంట్( Bold Content ) ఉందని అంటున్నారు.

అది బోల్డ్ కంటెంట్ కాదు నిజమైన వాస్తవమని అన్నది.సమాజంలో ఇప్పటికీ అరాకొరా ఇలా జరుగుతూనే ఉన్నాయని.

మరి తను ఎందుకు ఇలాంటి పాత్ర చేసిందని మీరు అనుకోవచ్చు కానీ నటి అన్నాక అన్ని పాత్రలు చేయాలి అని అన్నది.

Telugu Bollywood, Tamanna, Jee Karda Web, Tamannaglamor-Movie

ఇక కథకు ఇలాంటి సీన్స్ ఖచ్చితంగా అవసరం అనిపించాయని.ఒక రిలేషన్షిప్ ని వాస్తవంగా చూపించడానికి ఇవే కీలకం అంటూ అందుకే ఇలా బోల్డ్ గా నటించాల్సి వచ్చిందని తెలిపింది.ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని తిట్టినా అది జనాలకు నచ్చిన నచ్చకపోయినా కథ అనేది వాస్తవం.

కథలో భాగంగా వాటిని అలాగే చూపిస్తారు.తను ఇంత కంఫర్టబుల్గా ఇంత ఫ్రీగా ఇలా చేయడానికి కారణం డైరెక్టర్.

ఆయన ఇచ్చిన సూచనలు సలహాలు మేరకే ఇలా నటించగలిగాను అని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube