నాచురల్ స్టార్ నాని( Nani ).సినిమా ఇండస్ట్రీ లో ఎలాంటి సపోర్ట్ లేకుండా సొంత కాళ్లపై ఎదిగిన హీరోల్లో ఒకరు.
తొలి సినిమా అష్ట చమ్మ నుంచి నేటి వరకు ప్రతి సినిమా అంచనా వేసి మరి చేస్తూ వస్తున్నాడు.అతడు చేస్తున్న సినిమా కథల విషయంలో చాల జాగ్రత్తగా ఉండటం నాని యొక్క గొప్పతనం.
అయితే ఈ ఏడాది దసరా( Dussehra ) సినిమా తో సూపర్ హిట్ కొట్టిన నాని ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నాడు.ఈ ఏడాది చివర్లో క్రిస్టమస్ సందర్భంగా నాని నటిస్తున్న అతడి ముప్పయ్యవ సినిమా విడుదల కానుంది.
ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ చిత్రం ఆసాంతం కూతురు అనే ఒక ఎమోషన్ తో సాగుతుంది.ఈ సినిమా పోస్టర్స్ ఇప్పటికే విడుదల అయ్యి నాని 30 వ సినిమాకు సంబంధించి బజ్ ని పెంచాయి.

ఇక నాని ఈ చిత్రం కాకుండా హిట్ యొక్క మూడవ భాగం లో నటిస్తున్నాడు.ఈ సినిమా థ్రిల్లర్ సబ్జెక్టు గా ఉండబోతుంది అనే విషయం మన అందరికి తెలిసిందే.ఇక నాని నటిస్తున్న మరొక సినిమా పూర్తి స్థాయి డార్క్ థ్రిల్లర్ ప్రధాన అంశంగా తెరకెక్కుతుంది.ఈ సినిమాకు అంటే సుందరానికి డైరెక్టర్ అయినా వివేక్ ఆత్రేయ( Vivek Atreya ) దర్శకత్వం వహిస్తున్నాడట ఇలా నాని ఒక సినిమాతో మరొక చిత్రానికి సంబంధం లేకుండా కథలను ఎంచుకుంటూ వెళ్తున్నాడు.
ఇప్పటి వరకు కెరీర్ లో కూడా దాదాపు అన్ని సినిమాల విషయంలోకి ఇలాగే చేసాడు.ఒకసారి శ్యామ్ సింగ రాయ్ అంటూ పెరియాడికల్ సబ్జెక్టు తో వస్తే అంటే సుందరానికి అంటూ కామెడీ నేపధ్యం ఉన్న సినిమాతో వస్తాడు.

ఒకసారి క్రికెట్ నేపథ్యం ఉన్న జెర్సీ( Jersey ) సినిమాతో వస్తే మరొకసారి గ్యాంగ్ లీడర్ అంటూ గ్యాంగ్ తో సందడి చేస్తాడు.ఇలా నాని ఏ సినిమా చేసిన థింక్ డిఫరెంట్ అనే విధంగా ఉండటం తో పాటు అతడి ఫ్యాన్స్ కి పండగ అయ్యే మూవీస్ చేస్తున్నాడు.పెద్ద పెద్ద బుడ్జెట్స్ తో పని లేకుండా మీడియం బడ్జెట్ తో సినిమాలు తీస్తూ ఉన్నంత లో మంచి కలెక్షన్ సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.మిగతా హీరోల మాదిరి లేని ఫ్యాన్ ఇండియా క్రేజ్ అంటూ చూపించుకోకపోవడం నాని ప్రత్యేకత.







