ఎమ్మెల్యేలు పనితీరు మెరుగుపరుచుకోవాలని సీఎం జగన్ చెప్పారని మంత్రి జోగి రమేశ్ అన్నారు.తాము గెలవడమే తనకు ముఖ్యమని జగన్ తెలిపారన్నారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యే పనితీరు మార్చుకోవడానికి మరో అవకాశం ఉందని పేర్కొన్నారు.అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరాలని సీఎం జగన్ సూచించారన్నారు.
ఏపీలో రానున్న ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని మంత్రి జోగి రమేశ్ ధీమా వ్యక్తం చేశారు.







